కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధం.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్!!
తెలంగాణా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల వార్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతుంది. తెలంగాణ సీఎం కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తుంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు.
నిన్నటికి నిన్న దమ్ముంటే కేసీఆర్ కొడంగల్ లో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి తాజాగా కేసీఆర్ ను 24గంటల ఉచిత కరెంట్ విషయంలో సవాల్ చేశారు. కేసీఆర్ తెలంగాణాలో 24గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారని టార్గెట్ చేసిన ఆయన, కరెంట్ విషయంలో మొన్న ఆదిలాబాద్లో కరెంటు విషయంలో కేసీఆర్ కు సవాల్ విసిరారు.

ఇక తాజాగా కామారెడ్డి లోనూ సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి 24 గంటల ఉచిత విద్యుత్ పై కామారెడ్డి చౌరస్తాలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు కేసీఆర్ నిరూపిస్తే తను కొడంగల్ లోను, ఇటు కామారెడ్డి లోను నామినేషన్ ఉపసంహరించుకుంటానని అన్నారు.
సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు టైం ఉందని పేర్కొన్న రేవంత్ రెడ్డి లాగ్ బుక్ లు తీసుకొని కామారెడ్డి కి రా అంటూ సవాల్ విసిరారు. ప్రపంచం మొత్తం ప్రస్తుతం కామారెడ్డి వైపే చూస్తున్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా తాను ఎక్కడైనా గెలుస్తానని కేవలం కేసీఆర్ కు బుద్ధి చెప్పడం కోసమే కామారెడ్డి వచ్చానని పేర్కొన్నారు.
24 గంటల ఉచిత విద్యుత్ పై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్..!!#RevanthReddy #KCR #Congress #BRS #TSAssemblyElections #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #TelanganaElections2023 #Oneinidatelugu pic.twitter.com/TkqQDWQJhx
— oneindiatelugu (@oneindiatelugu) November 15, 2023
కర్ణాటకలో గెలిచినట్లు గాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగర వేస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని పేర్కొన్నారు. పది సంవత్సరాలు కష్టాలు పడ్డామని, కేసీఆర్ కు తిరిగి చెల్లించే సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి ఎన్నికల తీర్పు భారతదేశ చరిత్రలో గొప్ప తీర్పుగా నిలవాలని, 150 కోట్ల మంది కామారెడ్డి వైపే చూస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అంతేకాదు కల్వకుంట్ల కథకు ముగింపు పలికే గడ్డ కామారెడ్డి అని, తెలంగాణ కొత్త చరిత్రకు నాంది పలికే గడ్డ కామారెడ్డి అని పేర్కొన్న ఆయన ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనపై విసిగిపోయారని పేర్కొన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications