హరీష్ బలిదానం చేస్తే విగ్రహం, 2019 టీఆర్ఎస్‌లో చేరుతా: రేవంత్ సవాల్
కొడంగల్: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మబలిదానం చేస్తే తన సొంత డబ్బులతో మహబూబ్ నగర్ జిల్లా గడియారం సెంటర్లో విగ్రహం పెట్టిస్తానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం అన్నారు.
సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదన్నారు. అయినా జూన్ 11న ఏపీ లేఖ రాస్తే, అప్పటి నుండి ఇప్పటి వరకు హరీష్ రావు, ముఖ్యమంత్రి కెసిఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

అంతేకాకుండా, కృష్ణా జలాల పైన జూన్ 18, 19న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అసలు హరీష్ రావే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాజెక్టు సాధించవచ్చు కదా అని ప్రశ్నించారు.
2019లోపు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేస్తే తాను, రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ జెండా మోసేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అలా పూర్తి చేయకుంటే మంత్రులు జూపల్లి కృష్ణా రావు, లక్ష్మారెడ్డిలు టీడీపీలోకి వస్తారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications