ఏదైనా ఉంటే, ఇప్పుడే మాట్లాడు, కేసీఆర్ వచ్చాక..: తలసానితో రేవంత్
అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. శాసన సభ సమావేశాల్లో సభ్యులతో పాటు మంత్రులకు కూడా మాట్లాడే అవకాశం ఉండటం లేదని రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు.
మంత్రుల తరఫున కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావే మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఆయన మంత్రి తలసానితో మాట్లాడారు. 'అన్నా.. ఏదన్నా ఉంటే ఇప్పుడే మాట్లాడుకో... ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక ఎలాగు మీకు అవకాశం రాదు' అని తలసానితో రేవంత్ రెడ్డి అన్నారు. దానికి తలసాని నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

ప్రధానిపై వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు
దేశంలో పెద్దనోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోడీ నల్ల కుబేరులను కాపాడి సామాన్య పేద ప్రజల పొట్టకొట్టాడని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి హనుమంత రావు అన్నారు. పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య రాహుల్ సందేశ యాత్ర హైద్రాబాద్‌లో ప్రారంభమై మంగళవారం సాయంత్రం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుంది.
చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు షోలో వీహెచ్ పాల్గొని ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దు చేసిన మోడీ ప్రభుత్వం సామాన్యులపై సర్జికల్ దాడి చేసి కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications