వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదిలో వైద్యవిద్య చదివారా, నిజాలు చెప్పు: లక్ష్మారెడ్డికి రేవంత్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొడంగల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డికి టిడిపి యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం నాడు కౌంటర్ ఇచ్చారు. లక్ష్మారెడ్డి తన చదువు విషయంలో నిజాలు వెల్లడించాలని సూచించారు.

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి చదువు ఎంబీబీఎస్‌కు తక్కువ, ఆర్ఎంపీకి ఎక్కువ అనేలా ఉందన్నారు. హైదరాబాదు కర్నాటక ఎడ్యుకేషనల్ సొసైటీ 1981లో ప్రారంభమైతే 1987లో గుర్తింపు వచ్చిందన్నారు.

2004 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో 1988లో బిహెచ్ఎంఎస్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారని, సంబంధిత పత్రాలను రేవంత్ రెడ్డి చూపించారు. ఆయన ఎప్పుడు పూర్తి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు.

1987లో కళాశాలకు గుర్తింపు వస్తే బిహెచ్ఎంఎస్ అదే సంవత్సరం ఎలా పూర్తవుతుందని మంత్రి లక్ష్మా రెడ్డికే తెలుసునని చెప్పారు. లక్ష్మారెడ్డి వైద్యునిగా ప్రాక్టీస్ చేస్తే ఆయుష్ దగ్గర కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దగ్గర కానీ తన పేరును నమోదు చేయించుకున్నారా చెప్పాలన్నారు.

Revanth Reddy clash with TRS minister Laxma Reddy

టిఆర్ఎస్ పైన ఎల్ రమణ ఆగ్రహం

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్ రమణ ఆదివారం ఆరోపించారు. ప్రభుత్వం ఇదే తీరుతో ముందుకు సాగాలనుకుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులపై తాము వాస్తవాలను మాట్లాడుతుంటే పక్క రాష్ట్రంలోని నేతలను టీఆర్ఎస్ నాయకులు విమర్శించడమేమిటన్నారు.

తప్పుడు విధానాలను అనుసరిస్తూ, తప్పుడు ఆలోచనలతో ముందుకు సాగితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. తోటపల్లి రిజర్వాయర్ సాధించేంత వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు.

సమ్మెలోనే పారిశుద్ధ్య కార్మికులు

తెలంగాణ వ్యాప్తంగా 40 పురపాలక సంఘాల్లో కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సమ్మెను నెల క్రితమే పరిష్కరించిన ప్రభుత్వం రాష్ట్రంలో మిగిలిన 67 పురపాలక సంఘాల్లో సమ్మెపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్మికుల సమ్మెపై ప్రభుత్వ ప్రకటన వెలువడిన తర్వాత అదే విధానాన్ని ఇతర పురపాలక సంఘాల్లోనూ అమలు చేస్తారని అందరూ భావించారు. కానీ నెలరోజులవుతున్నా కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నుంచి ఏలాంటి ప్రకటన రాలేదు.

మరోవైపు పట్టణాల్లో వ్యర్థాలు పేరుకుపోతుండడంతో ఎక్కడికక్కడ పురపాలక సంఘాల పాలక మండలి సభ్యులు జోక్యం చేసుకొని 27 పురపాలక సంఘాల్లో సమ్మె విరమణ చేయించారు. కాగా మిగిలిన 40 పురపాలక సంఘాల్లో సుమారు 8 వేల మంది కార్మికులు ఇప్పటికీ సమ్మె కొనసాగిస్తున్నారు.

English summary
Revanth Reddy clash with TRS minister Laxma Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X