చంద్రబాబుకు షాకిస్తారా?: రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలుస్తారని జోరుగా ప్రచారం
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? ఆయన రాహుల్ గాంధీని కలిసేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.
Recommended Video

ఢిల్లీ: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? ఆయన రాహుల్ గాంధీని కలిసేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.

ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి, రాహుల్‌ను కలుస్తాడని ప్రచారం
ప్రస్తుతం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన దేశ రాజధానిలో ఉండటంతో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలుస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

ఖండించిన రేవంత్ రెడ్డి
ఢిల్లీలో ఉన్న తాను రాహుల్ గాంధీని కలుస్తాడని వచ్చిన వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. తాను రాహుల్ గాంధీని కలవడం లేదని ఆయన చెప్పారని తెలుస్తోంది. ఆ వార్తలు అన్ని ఊహాజనితాలు అని చెప్పారని తెలుస్తోంది.

ఆ విధంగా ప్రచారం ఎందుకు జరిగింది?
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండటంతో రాహుల్ గాంధీని కలుస్తారనే ప్రచారం జరగడం వెనుక.. ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపించడమే అంటున్నారు. 2019లో కేసీఆర్‌ను ఓడించేందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో కలుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

అలాంటి మాటలు వద్దని చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై తెలంగాణ టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు కొట్టి పారేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు అయితే.. పొత్తులపై తొందరపడి వ్యాఖ్యానించవద్దని చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలతో రేవంత్ రెడ్డి కొంత మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు.

కేవలం పొత్తు విషయమే
మరోవైపు, తెలంగాణలో టిడిపి పరిస్థితి దారుణంగా ఉందని రేవంత్ రెడ్డి కూడా అర్థం చేసుకున్నారని అంటున్నారు. తాను ఎలాగు తెరాసతో కలవలేను. కాబట్టి తనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అయితే, రేవంత్ పార్టీ మారితే బిజెపిలోకి వెళ్తారు తప్పితే.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లరని, కేవలం పొత్తు గురించి మాత్రమే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడారని అంటున్నారు.












Click it and Unblock the Notifications