ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్: 9మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటుకు రేవంత్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో లాభదాయక పదవులు అనుభవించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఇరవై మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారని, వీరిని కూడా అలాగే ప్రకటించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంటరీ సెక్రటరీలుగా కొనసాగారని చెప్పారు.

లాభదాయక పదవుల్లో కొనసాగినందున వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లాభదాయక పదవుల్లో కొనసాగారని చెప్పారు.












Click it and Unblock the Notifications