వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామి గౌడ్‌పై దాడి ఘటనపై అప్పుడే వాస్తవం తెలుస్తుంది: రేవంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్‌కు హెడ్ సెట్ తగిలన ఘటనపై అసెంబ్లీల ఉన్న ఆరు కెమెరాల ఫుటేజీలను బయటపెడితే వాస్తవం బయటపడుతుందని కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే కెమెరాల ఫుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

పాపాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శానససభలో దుర్యోధనుడి పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. కొన్ని సామాజిక వర్గాలపై కేసిఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Revanth reddy demands to reveal CCTV footage

దేశంలో ఏ శాసనసభలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని, ఇలాటంి చర్యలు చట్టాలు ముందు నిలబడవని రేవంత్ రెడ్డి అన్నారు.

జానా సస్పెన్షన్ సరి కాదు....

మరోసారి ిబఎసి సమావేశం నిర్వహించి కాంగ్రెసు సభ్యులపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అసెంబ్లీ ఘటనను టిడిపి సమర్థించడం లేదని, కానీ ఏకపక్ష నిర్ణయం సరి కాదని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. ఈ విషయంపై కనీసం తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. జానారెడ్డి సస్పెన్షన్ సరి కాదని అన్నారు.

English summary
Reacting on alleged attack on Swami Goud, Congress leader Revath Reddy demanded to reveal CCTV footage of Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X