రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా శవయాత్ర; రైతువేదికల వద్ద నిరసనల రచ్చ!!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు.
తాజాగా రైతు వేదికల్లో రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని పిలుపుమేరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలో కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం పాడె పై మోసి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు మూడు గంటలే కరెంటు ఉంటుందని, మళ్లీ పాత రోజులు వస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పాలని, పార్టీ నేతలను ప్రజలు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అన్నదాతల జీవితాలతో ఆటలాడుకుంటుందని, తన కపట బుద్ధిని మళ్లీ చూపించాడు అంటూ ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతు సభలను నిర్వహించి ఇంటి పై కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని ఎండగట్టాలని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన మేరకు రంగంలోకి దిగారు.
రైతుల కోసం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే రైతులకు ఎటువంటి నష్టం జరుగుతుంది అన్న అంశాలను ప్రధానంగా రైతులకు చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సభల ద్వారా అక్కడికి వచ్చిన రైతులకు కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పక వస్తుందని ఇప్పటికే పేర్కొన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు. బై బై కేసీఆర్ అనడం ఖాయం అని ఆయన తెలిపారు.
ఒకపక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని క్లారిటీ ఇస్తున్నప్పటికీ, అంతకుముందు రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ చేసిన వ్యాఖ్యలనే టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి పై గులాబీ దండు మూకుమ్మడి దండయాత్ర చేస్తున్నాయి.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications