హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధ్యక్షుడిగా ఎల్.రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎల్. రమణ కొనసాగుతారని ఆ పార్టీ అధనేత చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీ వివరాలను చంద్రబాబు నాయుడు బుధవారం వెల్లడించారు.

ఇకపోతే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లాల వారికీ, వివిధ వర్గాలకూ ప్రాతినిథ్యం లభించేలా ఈ కమిటీలను రూపొందిచామని ఆయన వెల్లడించారు.

Revanth Reddy elected as Telangana TDP working president

భవిష్యత్తులో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగేందుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో కమిటీలను రూపొందించామన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సుమారు 90 మందితో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి పోలిట్ బ్యూరోలో దేవేందర్‌ గౌడ్‌, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, నామా నాగేశ్వరరావు, రమేష్‌ రాథోడ్‌, ఉమా మాధవరెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు ఉన్నారు.

తెలంగాణ కమిటీ అధ్యక్షుడు: ఎల్‌.రమణ, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు: అనుముల రేవంత్‌ రెడ్డి.

జాతీయ ప్రధాన కార్యదర్శులు: లోకేశ్‌, కొనకళ్ళ నారాయణరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి.
ఉపాధ్యక్షులు: మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాములు, సత్యప్రభ.
జాతీయ అధికార ప్రతినిధులు: పయ్యావుల కేశవ్‌, బొండా ఉమామహేశ్వరరావు, ఇ.పెద్దిరెడ్డి, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, కింజరాపు రామ్మోహన నాయుడు.

జాతీయ కోశాధికారి: సిద్ధా రాఘవరావు.
కేంద్ర కమిటీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్‌: ఎంఎ షరీఫ్‌,
కేంద్ర కమిటీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌: వివిఎస్‌ చౌదరి
కేంద్ర కమిటీ మీడియా కమిటీ కన్వీనర్‌: ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్‌.

English summary
Revanth Reddy elected as Telangana TDP working president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X