తెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బ

Posted By:
Subscribe to Oneindia Telugu
అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి చెక్ | Oneindia Telugu

హైదరాబాద్:రేవంత్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం బిజెపికి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్లాన్‌ను రేవంత్‌ రూపంలో దెబ్బకొట్టిందని కమలనాధులు కలవరపడుతున్నారు. రేవంత్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలిగేలా ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.రేవంత్ అమిత్‌షా వ్యూహనికి చెక్ పెట్టారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''

2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేయాలని బిజెపి నిర్ణయం తీసుకొంది. తెలంగాణ పర్యటన సమయంలో ఈ విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయాన్ని తేల్చి చెప్పేశారు. 2019 ఎన్నికల నాటికి ఏపీలో టిడిపితో పొత్తు ఉంటుందని చెప్పారు. అయితే 2019 ఎన్నికల విషయంలో పొత్తుపై మాత్రం తేల్చి చెప్పలేదు.

ఢిల్లీకి రేవంత్‌: 2019లో పోటీ చేసే వారంతా అక్కడే, టిక్కెట్లకోసం రాహుల్‌ హమీ?

తెలంగాణలో బిజెపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకనేతలతో బిజెపి నేతలు కొంతకాలంగా సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగింది. కొందరు తెలంగాణ నేతలు కూడ తమకు బిజెపి నేతల నుండి ఫోన్లు వచ్చినట్టు అంతర్గత సంభాషణల్లో కూడ ప్రస్తావించారు.

టిఆర్ఎస్‌తో సంప్రదింపులు చేశాకే!: 'వారంతా కాంగ్రెస్‌లోకి'

అమిత్‌షా నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో మరో దఫా పర్యటించాల్సి ఉంది. అయితే గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని అమిత్‌షా పర్యటన వాయిదాపడింది.

అమిత్‌షా వ్యూహనికి రేవంత్ దెబ్బ

అమిత్‌షా వ్యూహనికి రేవంత్ దెబ్బ

అమిత్‌షా తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు చేసిన వ్యూహరచనను రేవంత్ దెబ్బతీశారు. టిడిపిని వీడి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం బిజెపికి పరోక్షంగా రాజకీయంగా నష్టపర్చిందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. రేవంత్‌రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో నూతనోత్తేజం వస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి వలసలు వెళ్ళాలను కొన్నారనే ప్రచారం సాగిన నేతలు కూడ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకొన్నట్టు కన్పిస్తోంది. ఈ రాజకీయ పరిణామాలన్నీ బిజెపికి రాజకీయంగా నష్టం కల్గించేలా ఉన్నాయి. అయితే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం టిడిపి కంటే కూడ బిజెపికి మరింత నష్టంగా మారింది. బిజెపి 2019 ప్లాన్‌ను రేవంత్ దెబ్బకొట్టాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

బిజెపిలోకి వలసలు లేవా?

బిజెపిలోకి వలసలు లేవా?

తెలంగాణలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన సమయంలోనే కీలకమైన కాంగ్రెస్ నేతలు బిజెపి తీర్థం పుచ్చుకొంటారనే ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడ బిజెపిలో చేరలేదు. కానీ, బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగింది. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నట్టు కన్పిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలు కూడ ఇతర పార్టీల్లో చేరాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నట్టు కన్పిస్తోంది. అయితే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ, 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఢీకొట్టే పరిస్థితి ఉంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిజెపి వైపు చూసిన నేతలు కూడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనే నిర్ణయంతో ఉన్నారనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

 సీనియర్లంతా వ్యూహత్మకంగా

సీనియర్లంతా వ్యూహత్మకంగా

కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సీనియర్లు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రేవంత్‌రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చే నేతలకు కాంగ్రెస్ సీనియర్లు ఎలాంటి అడ్డు చెప్పలేదు. పైగా పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు.

 రేవంత్‌ రూపంలో కాంగ్రెస్‌కు కలిసొచ్చింది

రేవంత్‌ రూపంలో కాంగ్రెస్‌కు కలిసొచ్చింది

కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రూపంలో కలిసొచ్చింది.. టిడిపి బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసిరానుంది. ఈ నియోజకవర్గాలు వచ్చే ఎన్నికల్లో అదనంగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు దక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లో ప్రచారం చేసే బాధ్యతను రేవంత్‌కు ఇస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. అదే సమయంలో టిఆర్ఎస్ వ్యతిరేకశక్తులతో కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో కలిసి పోటీచేయడం లేదా స్నేహపూర్వక పోటీ చేస్తే టిఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకుల భావన. ఈ పరిణామాలన్నీ కూడ బిజెపికి రాజకీయంగా ఇబ్బంది కల్గించేవిగా ఉన్నాయనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

 పార్లమెంట్‌కు సీనియర్లు పోటీ

పార్లమెంట్‌కు సీనియర్లు పోటీ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు కొందరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే సీనియర్లు ఎంపీ స్థానానికి పోటీచేస్తే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్థుల గెలుపు సునాయాసంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. మరో వైపు సీనియర్లు పార్లమెంట్ స్థానం నుండి పోటీచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవకాశాలు కోల్పోతామనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి. ఈ తరుణంలో ఆసక్తి చూపే నేతలు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం కూడ సానుకూలంగా ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revanth Reddy episode effected on Bjp 2019 elections strategy.Revanth Reddy along with his followers joined in Congress on Tuesday at Delhi. political analysts said that This incident advantage for Congress.
Please Wait while comments are loading...