సిఎమ్ కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయిన రేవంత్ రెడ్డి,
మేడ్చల్: రాజకీయాల్లో తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దికిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీగా పోటిచేస్తున్నారు..ఈనేపథ్యంలోనే టిఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు..ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ సిఎమ్ కేసిఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు..
ఇందులో భాగానే సిఎమ్ కేసీఆర్ ఉద్యమకారులకు మొండిచేయి చూపి ధనవంతులకు టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు.ఇందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డికి పేమెంట్ కోటాలో మంత్రి పదవి తోపాటు వేలం పాటలో రాజశేఖర్ రెడ్డికి సీటు దక్కిందని ఆరోపించారు .రూ.100 కోట్లకు పైగా ఖర్చుపెట్టే వారికే కేసీఆర్ టికెట్లు ఇచ్చారని విమర్శించారు.టిర్ఎస్‌లో జితేందర్ రెడ్డి, సీతారాంనాయక్, వివేక్ పరిస్థితి దిక్కుదోచకుండా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారన్నారు. టీఆర్ఎస్‌కు మళ్ళీ ఓటేస్తే కేసీఆర్‌కు ఇంతకంటే పెద్ద పదవి రాదన్నారు. తనను గెలిపిస్తే మల్కాజిగిరి ప్రజల ఆత్మగౌరవం పెరిగేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షం ఉండకూడదని వైఎస్ అనుకుంటే కేసీఆర్ ఉండేవారా?, ఇందిర అనుకుంటే వాజపేయి, ఆద్వానిల వంటి వారు ఉండేవారా? అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications