అందరి జాతకాలు తెలుసు: బీఆర్ఎస్ పారిపోయిందంటూ రేవంత్ ఫైర్

గ్రేటర్ హైదరాబాద్ ఏరియా పరిధిని ఇప్పుడున్న 600 చదరపు కిలోమీటర్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలను కూడా కలిపి మొత్తం 2053 చదరపు కిలోమీటర్లకు విస్తరించడం ద్వారా పరిపాలన సౌలభ్యం పెరిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)పేరుతో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు.

శాసనసభలో "హైదరాబాద్ మెట్రో సిటీలో స్థిరమైన పట్టణాభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలు" అంశంపై స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ సీఎం రేవంత్ ఈ విషయాలు వెల్లడించారు. ఎస్ఓటీ, గ్రేహౌండ్స్ తరహాలో తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఇంటి నెంబర్లు మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

Revanth Reddy fires at BRS in assembly while discussing on Hyderabad development

హైదరాబాద్‌లో సరస్సులు మాయమవుతున్నాయి. నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశామని సీఎం రేవంత్ చెప్పారు. రూ. 6 వేల కోట్ల ప్రతిపాదనలు ప్రధాని, జలశక్తి మంత్రికి ఇచ్చామని తెలిపారు. గతంలో రాత్రి 11 తర్వాత విచ్చలవిడిగా గంజాయి దొరికేది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా? అని ప్రశ్నించారు.

పబ్బు, ఫాంహౌస్‌ల్లో డ్రగ్ రాకెట్లతో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా? బీఆర్ఎస్ నేతలు సభలో ఉన్నప్పుడు డ్రగ్ రాకెట్లపై చర్చకు సిద్ధమని సీఎం ప్రకటించారు. తమకు అందరి జాతకాలు తెలుసని.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించట్లేదని సీఎం రేవంత్ చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకు సంస్కరణలు తెస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు.

నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్ వల్లే ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందుతుందన్నారు రేవంత్. మూసీని లండన్ థేమ్స్ నదిగా సుందరీకరణ చేస్తామన్నారు. మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలుస్తామన్నారు.
వైఎస్ఆర్.. ఓఆర్ఆర్ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారని, ఓఆర్ఓఆర్ ను తాకట్టు పెట్టిన వారు(బీఆర్ఎస్ సభ్యులు) సభ నుంచి పారిపోయారని రేవంత్ విమర్శించారు. అవాస్తవాలు ప్రచారం చేసి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బలహీనం చేయాలని చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యల్లో తప్పేం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+