సీఎం సొంతూరులో పండగ సందడి.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామానికి రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం నేడు ఆయన సొంతూరుకు తొలిసారిగా సీఎం హోదాలో బయలుదేరడమే. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండా రెడ్డిపల్లి రెవంత్ రెడ్డి స్వగ్రామం. ఈసారి దసరా పండుగ వేడుకలు అక్కడే జరుపుకోనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సొంతూరులో అడుగుపెట్టనున్నారు. భాగ్యనగరం నుంచి ఈ రోజు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొండారెడ్డి పల్లికి సీఎం చేరుకుంటారు. అక్కడే గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలను జరుపుతారు. దీంతోపాటు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీ, బీసీ భవనం, గ్రంథాలయం, పశువైద్య శాలలను ప్రారంభిస్తారు. గ్రామాన్ని సౌర విద్యుత్ ఆధారిత గ్రామంగా మార్చేందుకు కృషి చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి గ్రామంలో అడుగుపెట్టనుండడంతో సందడి వాతావరణం మొదలైంది.

శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..
కొండారెడ్డి పల్లి గ్రామంలో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్, అండర్ డ్రైనేజీ, నాలుగు లైన్‌ల రోడ్డు, సెంటర్ లైటింగ్, చిల్డ్రన్స్ పార్క్, జిమ్, దేవాలయం తదితర వాటికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ప్రాంతం, పర్యటన జరిగే ప్రదేశాలను పోలీసుల ముందస్తుగా ఆధీనంలోకి తీసుకోనున్నారు.
పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు సీఎంను కలిసేందుకు రానుండడంతో భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ వెళ్లేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications