ఇల్లు లేనివారికి త్వరలోనే శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా పాలన పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించిన క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో తెలంగాణా ప్రభుత్వ నిర్ణయం
ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదలకు ఇల్లు ఇచ్చే విషయం పైన మరో 10, 15రోజులలో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని కూడా అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనితో ఇటు రాష్ట్రప్రభుత్వం నుంచి అందే నిధులే కాకుండా, కేంద్రం నుంచి కూడా నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణానికి కావలసిన నిధులు అందుతాయి.

ఇందిరమ్మ ఇళ్ళ పథకం విధి విధానాలు, మార్గదర్శకాలపై కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలన్న క్రమంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్ మార్గదర్శకాలు, విధివిధానాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైన తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ కొద్ది రోజుల క్రితం అధ్యయనం చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలలో అధికారుల బృందాలు పర్యటించి అక్కడ అమలవుతున్న విధానాలను పరిశీలించారు.
ఇందిరమ్మ పథకం అమలుకు ప్రత్యేక యాప్
అర్హుల ఎంపికకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించారు. ఈ క్రమంలోనే అర్హుల ఎంపిక చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన తర్వాత అర్హులను ఎంపిక చేయాలని భావిస్తోంది. అత్యంత పారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రక్రియ ఉండాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఈ స్కీంను అమలు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణా ప్రజలకు మళ్ళీ శుభవార్త చెప్పేందుకు రేవంత్ సర్కార్ రెడీ
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 11వ తేదీన భద్రాచలం వేదికగా ఈ స్కీంను ప్రారంభించారు . మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 22,500 కోట్ల బడ్జెట్ తో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియలో జాప్యం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రజలకు శుభవార్త చెప్పడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
వంట గ్యాస్ కొరత వేళ కేంద్రం బిగ్ రిలీఫ్, తాజా ఆదేశాలు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications