రేవంత్ దమ్మున్న మగాడు, అందుకే: టీడీపీ జిల్లా అధ్యక్షుడి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

సిద్దిపేట: టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి దమ్మున్న మగాడు అని సిద్దిపేట జిల్లా టీడీపీ అధ్యక్షులు బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి బుధవారం అన్నారు.

ఆ కుట్రలో భాగంగానే, చుక్కలు చూపిస్తాడు: రేవంత్‌పై దుమ్మెత్తిపోశారు

  Revanth Reddy : సీతక్క ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్ | Oneindia Telugu
  రేవంత్ రెడ్డి దమ్మున్న మగాడు

  రేవంత్ రెడ్డి దమ్మున్న మగాడు

  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వేరే పార్టీలోకి వెళ్లిన రేవంత్ రెడ్డిని దమ్మున్న మగాడిగా అభివర్ణించడం గమనార్హం. ఇతర పార్టీ గుర్తులపై గెలిచిన నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇది సిగ్గుమాలిన చర్య అన్నారు.

  కేసీఆర్‌ది దిగజారుడుతనం

  కేసీఆర్‌ది దిగజారుడుతనం

  ఇలాంటి దిగజారుడుతనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్పడటం శోచనీయమని ఆయన అన్నారు. మగాల్లైతే ఇథర పార్టీ గుర్తులపై గెలిచిన నాయకులు రాజీనామాలు చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ విసిరారు.

  మూడున్నరేళ్లుగా ఒరగబెట్టిందేం లేదు

  మూడున్నరేళ్లుగా ఒరగబెట్టిందేం లేదు

  మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన విరుచుకుపడ్డారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

  కార్మికుల కోసం డిమాండ్లు

  కార్మికుల కోసం డిమాండ్లు

  ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు 55 సంవత్సరాలు దాటిన వారికి రూ.5వేల పెన్షన్ ఇవ్వాలన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party Siddipet chief Burugupalli Pratap Reddy on Tuesday said that Revanth Reddy, who joined Contress, on Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి