ఢిల్లీకి రేవంత్‌: 2019లో పోటీ చేసే వారంతా అక్కడే, టిక్కెట్లకోసం రాహుల్‌ హమీ?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి వెంట టిడిపికి చెందిన కీలక నేతలు సోమవారం రాత్రే ఢిల్లీకి చేరుకొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నేతలు లేని నియోజకవర్గాలకు చెందిన నేతలు రేవంత్‌వెంట వెళ్ళారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల విషయమై రేవంత్‌ వెంట వెళ్ళిన నేతలు హమీని తీసుకొనే అవకాశం ఉంది.

రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేది వీళ్లే! : Full List | Oneindia Telugu

టిఆర్ఎస్‌తో సంప్రదింపులు చేశాకే!: 'వారంతా కాంగ్రెస్‌లోకి'

రేవంత్‌రెడ్డి వెంట టిడిపిని వీడిన కీలక నేతలు ఢిల్లీకి చేరుకొన్నారు. రేవంత్‌తో పాటే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారు రేవంత్‌ వెంట ఉన్నారు.

ఉత్తమ్ సమక్షంలో బాబుపై రేవంత్ పొగడ్తలు: కెసిఆర్‌పై దూకుడు

కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే వచ్చే ఎన్నికల్లో తమకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయింపు విషయమై హమీని పొందనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేసే అభ్యర్థులంతా రేవంత్‌ వెంట ఢిల్లీకి చేరుకొన్నారు.

రేవంత్‌రెడ్డి వెంట వీరే: టిడిపికి షాకిచ్చారు, బలబలాలివే!

రేవంత్‌ వెంట ఢిల్లీకి వెళ్ళిన నేతలంతా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకొని మరీ వెళ్ళారు. పార్టీ మారితే రాజకీయంగా తమకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని భావించిన నేతలు రేవంత్‌ వెంట నడిచారు.

 పెద్దపల్లిలో విజయరమణరావుకు కాంగ్రెస్ టిక్కెట్టు ఒకేనా?

పెద్దపల్లిలో విజయరమణరావుకు కాంగ్రెస్ టిక్కెట్టు ఒకేనా?

పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, టిఆర్ఎస్ మధ్య పొత్తు ఉంది. ఈ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన చింతకుంట్ల విజయరమణరావు విజయం సాధించారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. ఆయన మొదటి నుండి టిడిపిలోనే ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా టిక్కెట్టు దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగి విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా విజయరమణరావు పోటీచేశారు. అయితే విజయరమణరావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టిఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి ఈ స్థానం నుండి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన భానుప్రసాద్‌రావు కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేరు. దీంతో విజయరమణరావు రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.2019 ఎన్నికల్లో విజయరమణరావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కనుందని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.

సీతక్కకు ములుగు టిక్కెట్టు దక్కేనా?

సీతక్కకు ములుగు టిక్కెట్టు దక్కేనా?

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు అసెంబ్లీ స్థానం నుండి సీతక్క 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు.. 2014 ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. రేవంత్‌తోపాటే సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. సీతక్క 2019 ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ స్థానం నుండి వీరయ్య 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా బిజయం సాధించారు.వీరయ్యను కాదని సీతక్కకు టిక్కెట్టు కేటాయిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే వీరయ్య కంటే సీతక్క మెరుగైన అభ్యర్థి అవుతారని సీతక్క అనుచరులు అభిప్రాయపడుతున్నారు. రాహూల్‌తో సమావేశమైన సమయంలో ఈ విషయమై హమీ తీసుకోనే అవకాశం ఉందంటున్నారు.

వేం నరేందర్‌రెడ్డికి వరంగల్‌ పశ్చిమ దక్కేనా?

వేం నరేందర్‌రెడ్డికి వరంగల్‌ పశ్చిమ దక్కేనా?

2004 అసెంబ్లీ ఎన్నికల్లో వేం నరేంద్‌రెడ్డి మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ స్థానం ఎస్‌టిలకు రిజర్వ్ అయింది. దీంతో వేం నరేందర్‌రెడ్డి వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానంపై కేంద్రీకరించారు. 2010లో టిడిపి అభ్యర్థిగా ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో కూడ ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుండి ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీచేశారు. స్వర్ణ కంటే వేం నరేందర్‌రెడ్డి మెరుగైన అభ్యర్థి అవుతారని ఆయన సన్నిహితులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే అదే సమయంలో నరేందర్‌రెడ్డికి ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇస్తే స్వర్ణ వర్గీయులు ఏ మేరకు సహకరిస్తారనే ప్రశ్న కూడ లేకపోలేదు.మరోవైపు వేం నరేందర్‌రెడ్డి వెంట టిడిపి క్యాడర్‌ వెళ్ళేందుకు సుముఖంగా లేరు. ఇదిలా ఉంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దాస్యం వినయ్‌భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా ఈ స్థానం నుండి వినయ్‌భాస్కర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధిస్తున్నారు.

నిజామాబాద్ రూరల్ టిక్కెట్టుకు అరికెల నర్సారెడ్డి

నిజామాబాద్ రూరల్ టిక్కెట్టుకు అరికెల నర్సారెడ్డి

నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానం నుండి అరికెల నర్సారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఖాయమని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మపురి శ్రీనివాస్ పోటీచేసి ఓటమిపాలయ్యారు.ఈ స్థానం నుండి టిఆర్ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన బాజిరెడ్డి గోవర్థన్‌ విజయం సాధించారు. టిడిపి అభ్యర్థిగా గతంలో ఈ ప్థానం నుండి మండవ వెంకటేశ్వర్‌రావు 2009లో ప్రాతినిథ్యం వహించారు. అయితే 2014లో బిజెపికి ఈ స్థానాన్ని కేటాయించింది. అయితే మండవ వెంకటేశ్వర్‌రావు 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ స్థానం నుండి అరికెల నర్సారెడ్డి పోటీకి సన్నాహలు చేసుకొంటున్నారు. అయితే రేవంత్‌ వెంట అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీ వెళ్ళారు. దీంతో నర్సారెడ్డికి నిజామాబాద్ రూరల్ టిక్కెట్టు‌పై హమీ లభించే అవకాశం ఉందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.

బిళ్యానాయక్‌కు దేవరకొండ టిక్కెట్టుకు మార్గం సుగమం

బిళ్యానాయక్‌కు దేవరకొండ టిక్కెట్టుకు మార్గం సుగమం

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన బిళ్యానాయక్‌ రేవంత్‌ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.గత ఎన్నికల్లో దేవరకొండ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బాలునాయక్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. ఈ స్థానం నుండి సిపిఐ అభ్యర్థి రవీంద్రకుమార్ 2014లో విజయం సాధించారు. ఇటీవల కాలంలో రవీంద్రకుమార్ సిపిఐని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానం నుండి అభ్యర్థి లేరు. దీంతో బిళ్యానాయక్‌ టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే తమకు ప్రయోజనం ఉంటుందని భావించారు.ఈ మేరకు రేవంత్‌ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మేడ్చల్ టిక్కెట్టుపై స్పష్టత దక్కేనా

మేడ్చల్ టిక్కెట్టుపై స్పష్టత దక్కేనా

మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుండి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ స్థానం నుండి టిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. అయితే జంగయ్యయాదవ్ ఈ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేశారు. అయితే లక్ష్మారెడ్డిని కాదని జంగయ్యయాదవ్‌కు టిక్కెట్టు ఇస్తారా అనేది ప్రస్తుతం హట్‌టాపిక్‌గా మారింది.

సూర్యాపేట, నల్గొండలోనూ కూడ ఇదే పరిస్థితి

సూర్యాపేట, నల్గొండలోనూ కూడ ఇదే పరిస్థితి

నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. 1999 నుండి కోమటిరెడ్డి ఈ స్థానం నుండి విజయం సాధిస్తున్నారు. అయితే కోమటిరెడ్డిని కాదని భూపాల్‌రెడ్డికి ఈ టిక్కెట్టు కేటాయించకపోవచ్చనేది పరిశీలకుల భావన. సూర్యాపేటలో కూడ రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని కాదని టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే పటేల్ రమేష్‌రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తారా అనేది కూడ చర్చనీయాంశంగా మారింది.2004, 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి దామోదర్‌రెడ్డి విజయం సాధించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revanth Reddy along with key leaders reached Delhi on Monday night Delhi. Revanth reddy and his followers will join in the presence of Aicc vice president Rahulgandhi on Tuesday. Revanth Reddy demanded to Congress party around 25 assambly seats for his team.
Please Wait while comments are loading...