Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈట‌ల‌, కొండా, వివేక్ ల‌కు కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఆహ్వానం; షర్మిలపై సెటైర్లు!!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. నేడు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన వాళ్లంతా క్షణికావేశంలో బీజేపీలో చేరారని బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేని వాళ్ళు కొందరు బిజెపి ని నమ్మి ఆ పార్టీలో చేరారని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయింది అని, మోడీని ఓడించవచ్చని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భద్రతను బీజేపీ గాలికి వదిలేసిందని, ప్రజలను పట్టించుకోకుండా కేంద్ర మంత్రులు కర్ణాటకలో తిరిగారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కు వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన అన్నారు.

Revanth Reddy invites Etela rajender, Konda and Vivek to join in congress; Satires on ys Sharmila

కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడిని కాదని, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలే నాయకులని అన్నారు. తన వల్ల ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్, కెసిఆర్ ఒకేలాగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కర్ణాటక లో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలని బీజేపీ ప్లాన్ చేసిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి బిజెపి కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు. దేశ స్థాయిలో బీజేపీని కాపాడడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మోడీ, కేసీఆర్ వేరు కాదని ఇద్దరు ఒకటేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కర్ణాటకలో లక్ష కోట్లు ఖర్చు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కెసిఆర్ కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కాంగ్రెస్ లేకపోతే కెసిఆర్ ఎక్కడ ఉండేవాడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయని షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే మిస్డ్ కాల్స్ ఇస్తున్నట్టు ఉన్నారని సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికలలో కెసిఆర్ ఓటమి ఖాయమని చెప్పారు . బీఆర్ఎస్ పార్టీ ఓడిపోకుంటే ప్రజల కోపానికి అర్థం ఉండదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+