Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్; ఐటెం సాంగ్ లా చూస్తారు: మంత్రి ఎర్రబెల్లి తిట్లదండకం!!

రేవంత్ ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం అని, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ నాశనం అయ్యిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డివి చిల్లర మాటలు : మంత్రి ఎర్రబెల్లి

రేవంత్ రెడ్డివి చిల్లర మాటలు : మంత్రి ఎర్రబెల్లి


పాదయాత్రలో ప్రజలు స్పందన కరువైన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం కోసం ప్రగతి భవన్ మీద నక్సలైట్లు గ్రైనేట్లు వేయాలని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఇటువంటి అసాంఘికమైన మాటలపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలు తరిమికొడతారంటూ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు. ములుగులో పాదయాత్ర మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ప్రజల నుంచి స్పందన లేక, నర్సంపేటలో జనం తిరగబడితే వాహనమెక్కి పారిపోయి మళ్ళీ మహబూబాబాద్ లో మాట్లాడుతున్నాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు.

రేవంత్ ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం

రేవంత్ ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం

రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తుందా అని ప్రశ్నించిన మంత్రి ఎర్రబెల్లి వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తగిన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పెట్టుకోవడమే కాంగ్రెస్ పార్టీకి ముప్పు అని పేర్కొన్న ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బిజెపిలో ఉంటే అక్కడ పార్టీ లేవలేదని, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమం లేవలేదని, బయటకు వెళ్ళగానే ఉద్యమం ఊపందుకుందని పేర్కొన్నారు. ఆ తర్వాత టిడిపికి వచ్చి దానిని రేవంత్ రెడ్డి నాశనం చేశాడని, రేవంత్ రెడ్డిని జనాలు ఐటెం సాంగ్ లా చూస్తారంటూ మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ను నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ను నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వెంట కిరాయి మనుషులు ఉంటారని, పార్టీ నాయకులు ఎవరూ ఉండరని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసు అని పేర్కొన్న ఎర్రబెల్లి ప్రస్తుతం ఒక స్థాయిలో ఉండి కూడా పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మంచిది కాదు అంటూ హితవు పలికారు. రేవంత్ రెడ్డి తనకు చదువు రాదని ఎద్దేవా చేశాడని.. చదువు రాకుండానే ఏడుసార్లు గెలిచానా అంటూ మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. చదువుకున్న దోపిడీ, దొంగతనాలు, వక్రమార్గాలు నీవి అంటూ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు.

ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తరిమికొడతారు

ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తరిమికొడతారు

ప్రగతిభవన్ పేల్చేయాలని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గుడని, బ్లాక్ మెయిలర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కెసిఆర్, కేటీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తరిమికొడతారంటూ మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదని, సీఎం దృష్టికి, హోం శాఖ దృష్టికి, డీజీపీ దృష్టికి తీసుకు వెళ్తామని, చర్యలు తప్పవని ఎర్రబెల్లి దయాకర్ తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+