అందులో రేవంత్ చంద్రబాబును ఫాలో అవుతున్నారా? పోటీ పడుతున్నారా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో రెండు రోజులపాటు సదస్సులు నిర్వహించారు. సిఐఐ సమ్మిట్ ను ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు. మొత్తం 13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో నిర్వహించిన సిఐఐ సమ్మిట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఘనంగా నిర్వహించడానికి ముందు నుంచి ప్లాన్ చేసుకున్న చంద్రబాబు అందుకు తగినట్టుగా ఘనంగా ఏర్పాట్లు చేయించారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. రేవంత్ ఫోకస్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో చంద్రబాబుతో పోటీపడి రేవంత్ రెడ్డి దీనిని ఘనంగా నిర్వహించడానికి ఫోకస్ చేస్తున్నారు. అయితే చంద్రబాబును ఫాలో అవుతున్నారన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్పేట లోని ఫ్యూచర్ సిటీ లో వచ్చే నెల 8, 9 తేదీలలో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనుంది.

100 ఎకరాల్లో గ్లోబల్ సమ్మిట్ .. కీలక ఏర్పాట్లు
సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో జరిగే ఈ కార్యక్రమం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఈ సదస్సును విజయవంతం చేయడానికి వివిధ శాఖల సమన్వయ సమావేశాన్ని నిర్వహించి అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యల పైన కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇక సదస్సు జరిగే రెండు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు అందించడానికి టీ ఫైబర్ ఆధ్వర్యంలో పది గిగా బైట్స్ ఫర్ సెకండ్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి.
అతిధుల కోసం మూడు హెలి ప్యాడ్ లు
దీని ద్వారా సుమారు పదివేల మందికి ఉచిత వైఫై లభిస్తుంది. అతిథుల సౌకర్యం కోసం సమీపంలోనే మూడు హెలిప్యాడ్ లను నిర్మించారు. ఇక రహదారుల పనులను మరమ్మతులు చేయడంతో పాటు, సదస్సు పరిసరాలలో కొత్త రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 4, 5తేదీలలో దీనికి సంబంధించి డ్రై రన్ కూడా నిర్వహిస్తారు. ఇది అచ్చం సదస్సు జరిగే తీరుకు రిహార్సల్ అని చెప్పవచ్చు. దీనిని బట్టి ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
ఈ సదస్సు నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. వైద్య సేవల విషయంలోను ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాహనాల పార్కింగ్ కు ఆరు స్థలాలను ఎంపిక చేసి ఎవరికి వారికి విడివిడిగా కేటాయించనున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక జనరేటర్ లను కూడా ఏర్పాటు చేశారు. సదస్సులో రెండువేల మంది అతిథులు కూర్చోవడానికి, మీడియాకు ఏర్పాట్లు చేశారు.
సుమారు 3,000 మంది దేశ విదేశీ అతిథులు ఈ సదస్సుకు హాజరు
వివిధ రంగాలకు సంబంధించి 45 స్టాల్స్ ను ప్రాంగణం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా వేదికలను ఏర్పాటు చేశారు. సుమారు 3,000 మంది దేశ విదేశీ అతిథులు ఈ సదస్సుకు హాజరు అవుతారని ఒక అంచనా స్టార్ హోటల్ నుంచి ఆహారాన్ని అందించనున్నారు మూడు భజన కేంద్రాలను ఏర్పాటుచేసి వాటిలో వీవీఐపీలకు ఒకటి మిగిలిన రెండు అతిథులకు కేటాయించారు. ప్రాంగణ సుందరీ కరణ పనులు హెచ్ఎండిఏ, పారిశుద్ధ్య పరిరక్షణ బాధ్యత మున్సిపాలిటీ చూడనుంది. ఏపీ కంటే బాగా ఈ సమ్మిట్ ను నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications