వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి ఇష్యూ: సూపర్.. రమణకు బాబు ప్రశంసలు, దేనికి సంకేతం

ఓ వైపు టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టి-టిడిపి చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.రేవంత్ రెడ్డిని పార్టీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ వైపు టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టి-టిడిపి చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

చంద్రబాబు క్లియర్: రేవంత్ రెడ్డి ఔట్, రమణ దూకుడు అదే...చంద్రబాబు క్లియర్: రేవంత్ రెడ్డి ఔట్, రమణ దూకుడు అదే...

రేవంత్ రెడ్డిని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా కార్యక్రమాలు చూడొద్దని చంద్రబాబు స్పష్టం చేసినట్లు ఎల్‌ రమణ స్పష్టం చేశారు. లండన్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు తనతో ఫోన్‌లో మాట్లాడారన్నారు.

సొంత ఇలాకాలో 'ముందే' దెబ్బ: రేవంత్‌ని దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ పక్కా స్కెచ్సొంత ఇలాకాలో 'ముందే' దెబ్బ: రేవంత్‌ని దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ పక్కా స్కెచ్

అయితే తెలంగాణ టిడిపి ఆదేశాలను రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఆయన తన దూకుడు వైఖరితోనే ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిటిడిపి చీఫ్ ఆదేశించినా తగ్గడం లేదు.

ఎల్ రమణకు ఫోన్

ఎల్ రమణకు ఫోన్

ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ టిడిపి చీఫ్ ఎల్ రమణకు ఫోన్ చేశారు. ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఎల్ రమణ పార్టీ కార్యక్రమాలు బాగా చేస్తున్నారని కితాబిచ్చారు. అదే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

చంద్రబాబు మనసులో ఏముందో తెలిసింది

చంద్రబాబు మనసులో ఏముందో తెలిసింది

ఓ వైపు రేవంత్ రెడ్డి ఇష్యూ వాడిగా వేడిగా ఉంటే దానిపై ఆరా తీయటం వరకు ఓకే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రమణకు కితాబివ్వడంతో చంద్రబాబు మనసులో ఏం ఉందో తేలిపోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డిని లైట్‌గా తీసుకున్నట్లుగా ఈ పరిణామంతో తేలిపోయిందని అంటున్నారు.

మరింత తేలిపోయింది

మరింత తేలిపోయింది

ఇప్పటికే రమణ - రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రమణ ఇటీవల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నుంచి స్పష్టత వచ్చినందు వల్లే ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫోన్ చేసి మెచ్చుకోవడంతో మరింత తేటతెల్లమయిందని అంటున్నారు.

రేవంత్ రెడ్డికి షాకిచ్చేందుకు తెలంగాణ టిడిపి

రేవంత్ రెడ్డికి షాకిచ్చేందుకు తెలంగాణ టిడిపి

కాగా, రేపు మధ్యాహ్నం 1 గంటకు గోల్కొండ హోటల్‌లో టీడీఎల్పీ భేటీ జరగనుందని, దానికి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే హోదాలో పిలుస్తామని ఎల్ రమణ తెలిపారు. నేతలంతా పార్టీ మార్గంలో పనిచేసేలా చూడాలని చంద్రబాబు చెప్పినట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు వచ్చే వరకు ఎవరితోను మాట్లాడను

చంద్రబాబు వచ్చే వరకు ఎవరితోను మాట్లాడను

దీనిపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. శాసన సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. తాను ఇవ్వాలనుకున్న వివరణ చంద్రబాబుకే ఇస్తానని చెప్పారు. చంద్రబాబు వచ్చే వరకు ఎవరితో మాట్లాడనని చెప్పారు. అధినేత తనపై ఎంతో నమ్మకం ఉంచారని, స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు.

రేపు టిడిఎల్పీ భేటీపై ఉత్కంఠ

రేపు టిడిఎల్పీ భేటీపై ఉత్కంఠ

గురువారం తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం భేటీ కానుంది. ఇప్పుడు ఈ భేటీపై అందరి దృష్టి ఉంది. తెలంగాణ టిడిపిలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో పాటు సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్యలు మాత్రమే. ఓ వైపు బిజెపి - టిడిపి కలిసి శాసన సభా పక్ష సమావేశం నిర్వహిస్తుందని, దానికి రావాలని ఎల్ రమణ ఆదేశించారు. తనతో రావాలని రేవంత్ చెప్పారు. దీంతో సండ్ర, కృష్ణయ్యలు ఎవరి వైపు వెళ్తారనేది చర్చనీయాంశమైంది. చాలా రోజులుగా టిడిపికి దూరం పాటిస్తున్న ఆర్ కృష్ణయ్య అదే వైఖరి కొనసాగించే అవకాశముంది.

English summary
Andhra Pradesh Chief Minister and TDP national president Nara Chandrababu Naidu asked Telangana TDP chief L Ramana about party situation. He praised L Ramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X