ఇందిరా పార్క్ వద్ద రేవంత్ రెడ్డి - జైపాల్ రెడ్డి చేతులు కలిపారు!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిలు చేతులు కలిపారు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డిలు చేతులు కలిపారు! నారాయణపేటను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళనలో కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి, టిడిపి నేత రేవంత్ రెడ్డిలు కలిశారు. ఈ సందర్భంగా నేతలు చేతులు కలుపుకున్నారు. కాగా, రేవంత్ రెడ్డికి జైపాల్ రెడ్డి బంధువు అవుతారనే విషయం తెలిసిందే.
కాగా, కొద్ది నెలల క్రితం 12 జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం 31 జిల్లాలుగా చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని జిల్లాల కోసం ఉద్యమం కొనసాగుతోంది.

పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలి: పొంగులేటి
ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయకట్టు కింద సాగునీరు లేకపోవడంతో లక్షల ఎకరాల పంట ఎండిపోతోందన్నారు.
పెద్దనోట్ల రద్దు, రుణామఫీ కాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలిసి రైతులు కోసం పోరాటం చేయాలన్నారు.
రైతులు, సామాన్యుల సమస్యలకు ప్రభుత్వానికి పట్టడంలేదని అన్నారు. హైకోర్టు విభజన ఊసే ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. ఖమ్మం జిల్లాలో కల్తీకారం ముఠాపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications