వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ఇంటికి రేవంత్, కాంగ్రెస్‌లో చేరిక: కొందరు నేతల అసంతృప్తి

రేవంత్ రెడ్డి మంగళవారం ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రేవంత్ రెడ్డి మంగళవారం ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాక్?కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాక్?

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాతో తొలుత భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ నేతలతో కలిసి కార్యాలయం చేరుకున్నారు.

రాహుల్ గాంధీ ఇంటికి రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ ఇంటికి రేవంత్ రెడ్డి

అనంతరం ఏఐసీసీ కార్యాలయం నుంచి రేవంత్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ నివాసానికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా తీసుకు వెళ్లారు. అక్కడ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 18 మంది ముఖ్య నేతలు రేవంత్ వెంట ఉన్నారు.

రేవంత్ రెడ్డి వెంట

రేవంత్ రెడ్డి వెంట

రేవంత్ రెడ్డి వెంట సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయ రమణా రావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్ధన్, సోయం బాబురావు, జంగయ్య, బిల్యా నాయక్, రమేష్ రెడ్డి, శశికళ తదితరులు ఉన్నారు.

కొందరు కాంగ్రెస్ నేతల అసంతృప్తి

కొందరు కాంగ్రెస్ నేతల అసంతృప్తి

మరోవైపు, పార్టీలోకి వీరి రాకను కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎంతో కాలం నుంచి పార్టీ కోసం పని చేస్తున్నవారిని కాదని కొత్తవాళ్లను పార్టీలోకి చేర్చుకోవడం భావ్యం కాదంటున్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్‌ను తిట్టిన వారిని, చేర్చుకోవడం సరికాదంటున్నారు. రాహుల్ గాంధీని కలసి, తమ అభిప్రాయాలను వెల్లడిస్తామంటున్నారు.

రేవంత్ వెంట వందమంది నేతలు

రేవంత్ వెంట వందమంది నేతలు

రేవంత్ రెడ్డి తనతో పాటు పది పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులు, పలువురు జిల్లా పార్టీ అధ్యక్షులను, పెద్ద ఎత్తున జెడ్పీటీసీలు ఇలా మొత్తం వంద మందికి పైగా కీలక నేతలను రేవంత్ తన వెంట తీసుకు వెళ్లారని తెలుస్తోంది.

English summary
Kodangal MLA Revanth Reddy went to AICC vice president Rahul Gandhi's residence on Tuesday. He joined Congress Party in the presence of Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X