రేవంత్ అప్రూవర్‌గా మారితే ఎలా?: నేతల చర్చలు
హైదరాబాద్: ఓటుకు నోటు ఆరోపణలపై సాక్ష్యాలతో దొరికిపోయి ప్రస్తుతం విచారణ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, రేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారితే ఏం చెయ్యాలన్న విషయంపై తెలుగుదేశం నేతల మధ్య తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి.
తనను ముందు నిలిపి ఇరికించారని ఆయన ఇప్పటికే తన కుటుంబసభ్యుల వద్ద వాపోయినట్లు సమాచారం. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి కనీసం బెయిలన్నా వెంటనే వచ్చేలా చూడలేదని ఆయన చెప్పినట్లుగా తెలిసింది.

ఈ నేపథ్యంలో తనను కలిసేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలను నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు ఏసిబి వద్ద ఉండటంతో ఇక ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో అప్రూవర్‌గా మారి, తన వెనుక ఉన్న సదరు ‘బాస్', పెద్దల వివరాలు చెప్పేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఈ విధంగా చేసి తనను ప్రలోభపెట్టి ఈ పని చేసేందుకు పురిగొల్పారని ఆయన వాదించుకోవచ్చని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో బడా నేతలు ఇరుక్కుంటారు కాబట్టి, తనపై కేసు తీవ్రతా తగ్గుతుందని రేవంత్ భావిస్తున్నట్లు తెలిసింది. రేవంత్ అప్రూవర్‌గా మారే అవకాశం ఉన్నందునే పలువురు దేశం నేతలు తరచూ రేవంత్‌ను కలిసి వస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications