వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌ వెనుక కాంగ్రెస్ సీనియర్లు: డికె అరుణతో చర్చలు, కోమటిరెడ్డి బ్రదర్స్ డైలమా?

కాంగ్రెస్ పార్టీలో టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేరడం వెనుక కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడ ఉన్నారనే ప్రచారం కూడ సాగుతోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే 2019 ఎన్నికల్లో

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేరడం వెనుక కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడ ఉన్నారనే ప్రచారం కూడ సాగుతోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వగలుగుతామనే అభిప్రాయంతో ఆ పార్టీ సీనియర్లు ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్‌ను ప్రకటిస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సీఎం అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీలో లేదు.

Recommended Video

Revanth Reddy VS TDP senior leaders బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా! అదే జరిగితే? | Oneindia Telugu

వెల్‌కమ్ వ్యూహం: ఎమ్మెల్యే టిక్కెట్లలో కోటా పెంచాలి, కెసిఆర్‌‌ను కోరిన తుమ్మల?వెల్‌కమ్ వ్యూహం: ఎమ్మెల్యే టిక్కెట్లలో కోటా పెంచాలి, కెసిఆర్‌‌ను కోరిన తుమ్మల?

2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పథకం ప్రకారంగానే టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?

రేవంత్‌రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడ ఉత్సాహం నెలకొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలున్నారు. పార్టీ బలపడితే 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటున్నారు ఆ పార్టీ నేతలు.

రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!

రేవంత్ వెనుక కాంగ్రెస్ సీనియర్లు

రేవంత్ వెనుక కాంగ్రెస్ సీనియర్లు

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైందంటున్నారు. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి రెండు రోజులు బస చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జానారెడ్డి తనయుడు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి కూడ ఢిల్లీలోనే మకాం వేశారనే ప్రచారం కూడ ఉంది.మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కూడ రేవంత్ పార్టీలోకి రావడం పట్ల సానుకూలంగానే ఉన్నారంటున్నారు.జానారెడ్డితో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టివిక్రమార్క , మాజీ మంత్రి శ్రీధర్‌బాబులాంటి వారు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతించారు.

కాంగ్రెస్ సీనియర్ల వ్యూహమిదే

కాంగ్రెస్ సీనియర్ల వ్యూహమిదే


రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. టిడిపి నుండి వచ్చే నేతలను సమన్వయం చేసుకొంటే 2019 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు అంచనావేస్తున్నారంటున్నారు. అయితే అదే సమయంలో ఒకవేళ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని చేపడితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరికి దక్కుతోందనే విషయమై కాంగ్రెస్ సీనియర్లకు ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేదు. పార్టీ అధిష్టానమే సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తోంది. అయితే సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి అని ముందుగా ప్రకటిస్తే సీనియర్లు కొంత అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. అయితే అదే సమయంలో సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే పార్టీకి మరింత ఊపు వచ్చే అవకాశం కూడ లేకపోలేదు. అయితే సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ముందుగానే ప్రకటించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీలో లేదు. దీంతో సీనియర్లు హయిగా ఊపిరి పీల్చుకొంటున్నారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

డికె అరుణతో చర్చల వెనుక

డికె అరుణతో చర్చల వెనుక

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా నుండి తొలిసారిగా 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి రేవంత్ విజయం సాధించారు.ఆ సమయంలో పాలమూరు జిల్లా నుండి డికె అరుణ, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ఉన్నారు. డిఆర్‌సీ సమావేశంలో మంత్రి డికె అరుణకు, ఎమ్మెల్యే రేవంత్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది. అంతేకాదు రేవంత్ తన స్థానం నుండి మంత్రులు కూర్చొన్న వేదికపైకి వెళ్ళి వాదనకు దిగారు. ఆ సమయంలో వనపర్తి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి రేవంత్‌ను సముదాయించి తన స్థానం వద్దకు తీసుకువచ్చారు.ఆ తర్వాత వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఆరోపణలు పరస్పరం దూషించుకొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ ఇద్దరు కూడ కెసిఆర్‌పై పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకుగాను డికె అరుణతో రేవంత్‌రెడ్డి ముందుగానే చర్చించారని సమాచారం. రేవంత్‌ తనతో చర్చించిన విషయం వాస్తవమేనని డికె అరుణ ప్రకటించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఝలక్

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఝలక్

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కోమటిరెడ్డి బ్రదర్స్‌ అంతగా సుముఖంగా లేరనే ప్రచారం సాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కోమటిరెడ్డి బ్రదర్స్ ‌ ఆశతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన సీట్లను సాధించేలా కృషిచేస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. అయితే పీసీసీ పదవిని తమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమయంలో రేవంత్‌రెడ్డి పార్టీలోకి వస్తే రాజకీయంగా తమకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

యువకులకు ప్రోత్సాహం

యువకులకు ప్రోత్సాహం

కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్ చేరితే యువకుల్లో ఉత్సాహం ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు రేవంత్‌ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా యూత్‌ను కూడ ఆకర్షించే అవకాశం కలుగుతోందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అసలు ఉనికే లేదనే పరిస్థితి నుండి టిఆర్ఎస్‌ను ఢీకొట్టే స్థితికి రావడం వల్ల రాజకీయంగా ప్రయోజనంగా ఉంటుందని సీనియర్లు భావిస్తున్నారు. పార్టీ బలోపేతమైతే రాజకీయంగా తమకు ప్రయోజనమని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కెసిఆర్‌ను వ్యతిరేకించే నేతలంతా ఏకతాటిపై నిలడడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా రేవంత్ రాకను ఉత్తమ్ స్వాగతించారు.

English summary
Congress Party is having lot hopes on this Fire Brand leader who can have some things work on his side all the time. Revanth Reddy's entry will surely strengthen the Congress while several people are thinking this should be a nuisance in the party cadre. Telangana Congress is currently divided into two groups one in support of Revanth and other in against to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X