తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరో తేలింది..!!

Telangana assembly speaker: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంకొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క నియమితులు కానున్నారు. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Revanth Reddy Oath taking: G Prasad Kumar appointed as a Telangana assembly speaker

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరో తేలిపోయింది. కీలకమైన ఈ స్పీకర్ పదవికి పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్ (G Prasad Kumar) పేరు ఖరారైంది. ఆయనను స్పీకర్‌గా అపాయింట్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జీ ప్రసాద్.. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భారత్ రాష్ట్ర సమితికి చెందిన డాక్టర్ మెతుకు ఆనంద్‌పై 12, 893 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. గడ్డం ప్రసాద్‌కు మొత్తం 86,885 ఓట్లు పోల్ అయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 73,992 ఓట్లు పడ్డాయి.

2009లో జీ ప్రసాద్.. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. ఆ తరువాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూశారు. అయినప్పటికీ- ఆయనపై నమ్మకంతో వికారాబాద్ టికెట్‌ను కేటాయించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ సారి 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Revanth Reddy Oath taking: G Prasad Kumar appointed as a Telangana assembly speaker

ప్రసాద్ కుమార్‌ను తొలుత కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. స్పీకర్‌గా దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేస్తారంటూ వార్తలొచ్చాయి. స్పీకర్ పదవిని తీసుకోవడానికి శ్రీధర్ బాబు ఆసక్తి చూపలేదు. మంత్రిగా పని చేయడానికే ప్రాధాన్యతను ఇచ్చారు. దీనితో ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం స్పీకర్‌గా అపాయింట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+