ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు, కేంద్ర భద్రత కావాలి: హైకోర్టులో రేవంత్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత కావాలని ఆయన అందులో పేర్కొన్నారు. రేవంత్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తనకు కేంద్రం నుంచి భద్రత కావాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల పైన నమ్మకం లేదని చెప్పారు. తనకు కొందరి నుంచి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది.

కెసిఆర్ అమరవీరులను మర్చిపోయారు: రేవంత్ రెడ్డి

అంతకుముందు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ అమరవీరుల పునాదులపై అధికారంలోకి వచ్చిన కెసిఆర్ వారిని మర్చిపోయారన్నారు. తెలంగాణ ద్రోహులను కుడిభుజం అని చెప్పుకునే కెసిఆర్ నిజమైన తెలంగాణవాదేనా అని ప్రశ్నించారు.

Revanth Reddy petition in HC for Central security

రాష్ట్రంలో కరువు తాండవిస్తుండగా, తాగు, సాగునీరు, వలసల పైన పట్టించుకోకుండా ఖమ్మం ప్లీనరీలో బీర్లు, బిర్యానీలు ఏర్పాటు చేసుకున్నారని దుయ్యబట్టారు. టిడిపి హయాంలో పసుగ్రాసాన్ని రైళ్లలో తెప్పించామని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. టిడిపి పేదల పార్టీ అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోని జీవోల మేరకే ప్రాజెక్టులు: హరీష్ రావు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. కొల్లాపూర్‌ మండలం నార్లపూర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. పూటకో ఉత్తరం రాసి పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు కట్టొద్దని ఆంధ్రా కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారని, అక్రమంగా హంద్రినీవాకు నీళ్లు తీసుకుపోతే డీకే అరుణ హరతి పట్టారన్నారు.

పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా ధర్నా చేస్తుంటే డీకే అరుణ నోరు ఎందుకు పెగలడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో ప్రకారం పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, పాలమూరు ప్రాజెక్టుకు కాంగ్రెస్ సహకరిస్తదా? సహకరించదా తేల్చుకోవాలన్నారు.

పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే రాజకీయ భవిష్యత్ ఉండదనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రాజెక్టు అడ్డుకోవాలని చూస్తున్నాయన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలు టిడిపి కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేస్తారన్నారు. ప్రాజెక్టు కట్టేందుకు సహకరించిన రైతులకు పాదాభివందనం అన్నారు.

నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఏదుల గ్రామానికి రూ.2 కోట్ల ప్యాకేజీ ఇస్తామని, పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని, పాలమూరు ఎత్తిపోతల దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పాలమూరు ప్రజలకు ఎంత చేసినా తక్కువే అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపడుతుందన్నారు. అవసరమైన భూములు ముందుగా సేకరించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నామన్నారు. దీని ద్వారా త్వరితగతిన పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 'అంజనగిరి'గా నామకరణం చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశాయని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+