ఇక తెలంగాణ‌ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రేసుగుర్ర‌మే..!!

హైద‌రాబాద్: తెలంగాణ కాంగ్రెస్ క్రియాశీల రాజ‌కీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న రేవంత్ రెడ్డికి ఏఐసీసీ కీల‌క బాద్య‌త‌లు అప్ప‌జెప్పింది. కాంగ్రెస్ పార్టీలో చేరి చాలాకాల‌మైన‌ప్ప‌టికి ప‌ద‌వి మాత్రం ఆల‌స్యంగా వ‌రించిందని చెప్పొచ్చు. తెలంగాణ‌లో అదికార పార్టీ విధానాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎండ‌గ‌ట్టే రేవంత్ ఇక వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ హోదాలో ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్ల‌నున్నారు. ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌విని కోరుకున్న రేవంత్ రెడ్డి కి అదిష్టానం మాత్రం పార్టీలో నంబ‌ర్ టూ స్థానం క‌ట్ట‌బెడుతూ కార్య‌నిర్వాహ‌క అద్యక్ష్య బాద్య‌త‌లు క‌ట్ట‌బెట్టింది. కాంగ్రెస్ పార్టీలో ఏ ప‌ద‌వి ఇచ్చినా ఆ బాద్య‌త‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు, అదిష్టానం క‌ట్ట‌బెట్టిన ప‌ద‌వి ప‌ట్ల ఎలాంటి అసంత్రుప్తి లేద‌ని రేవంత్ రెడ్డి వ‌న్ ఇండియా తెలుగు కి తెలిపారు.

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి స‌ముచిత స్థానం..! ఇక వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ గా ప్ర‌స్థానం..!!

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి స‌ముచిత స్థానం..! ఇక వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ గా ప్ర‌స్థానం..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కింది.తెలంగాణ కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనను రాహుల్ గాంధీ నియమించారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు అదే పదవి ఇక్కడ దక్కడం విశేషం. ప్రచార కమిటి ఛైర్మన్ పదవిని ఆయన ఆశించినప్పటికి పార్టీ అధిష్టానం మాత్రం వర్కింగ్‌ ప్రెసిడెంట్ కే మొగ్గు చూపించింది. అనేక మంది సీనియర్లు పదవుల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ప్రచార కమిటి ఇస్తే వివాదం చెలరేగుతుందని హైకమాండ్ భాావించినట్లు సమాచారం.ఇదే సమయంలో పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు రేవంత్ రెడ్డికి కీలక పదవి రాకుండా అడ్డుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ప్ర‌చార సార‌ద్యం కోరుకున్న రేవంత్..! కార్య‌నిర్వాహక‌ బాద్య‌త‌లు ఇచ్చిన రాహుల్..!!

ప్ర‌చార సార‌ద్యం కోరుకున్న రేవంత్..! కార్య‌నిర్వాహక‌ బాద్య‌త‌లు ఇచ్చిన రాహుల్..!!

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ముందుంచి అంత ఆసక్తిగా లేరు. అయితే రాహుల్ గాంధీ నచ్చచెప్పిన నేపథ్యంలో ఆయన బాధ్యతలకు రెఢీ అయ్యారు. పార్టీలో చేరిన అత్యంత తక్కువ సమయంలో రేవంత్ రెడ్డి కీలక పదవి దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎదుర్కొవడం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. అద్భుతమైన వాగ్దాటితో పాటు టీఆర్ఎస్ పైన పోరాటంలో ఆయనకు విశ్వసనీయత ఉంది.

ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డే ప్ర‌ధాన ఆక‌ర్శ‌ణ‌..! రేవంత్ తో ప్ర‌చారం చేయించేందుకు నాయ‌కుల ఉత్సాహం..!!

ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డే ప్ర‌ధాన ఆక‌ర్శ‌ణ‌..! రేవంత్ తో ప్ర‌చారం చేయించేందుకు నాయ‌కుల ఉత్సాహం..!!

ఈ సారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరుపున స్టార్ క్యాంపైయినర్ కాబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి రెఢీ అవుతున్నారు.రేవంత్ రెడ్డిని తమ నియోజకవర్గాలకు తీసుకెళ్లడానికి పార్టీ నాయకులు పోటీపడుతున్నారు.ఇంత కాలం పాటు తనకు పదవి లేకపోవడంతో క్షేత్రస్థాయికి వెళ్లడానికి పెద్దగా ఇష్టపడలేదు. తెలుగుదేశం నుంచి తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన నాయకులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంతో పాటు గెలిపించుకునే బాధ్యతను రేవంత్ తీసుకోబోతున్నారు.

పార్టీ మారిన నేత‌కు ప‌ద‌వి..! ప‌ద‌వుల పంప‌కాల్లో ఏమ‌రుపాటు..!

పార్టీ మారిన నేత‌కు ప‌ద‌వి..! ప‌ద‌వుల పంప‌కాల్లో ఏమ‌రుపాటు..!

మరో వైపు పార్టీలో చేరిన వెంటనే రేవంత్ రెడ్డికి కీలక పదవి ఇవ్వడంపైన కాంగ్రెస్ లో పలువురు సీనియర్లు అసమ్మతి గళాన్ని లేవనెత్తుతున్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఖమ్మం జిల్లా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
మరో వైపు ప్రచార కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్కను పార్టీ నియమించింది.మేనిఫోస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహకు అవకాశం కల్పించారు.పలువురు సీనియర్ నేతలకు కూడా వివిధ కమిటీల్లో స్థానం దక్కింది.మరో వైపు ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డికి పలు కీలక కమిటీ ల్లో స్థానం కల్పించారు. ఆయన పార్టీ మారినప్పటికి ఆయన విషయాన్ని అధిష్టానం గమనించకపోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+