హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనవరి 28,29,30 తేదీల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రోడ్డు షోలో పాల్గొంటారని తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో టీయూడబ్ల్యుజే నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

పాలన, విధానాల్లో ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మధ్య పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. తనను వ్యతిరేకిస్తున్నందుకు సిద్దిపేటకు పైసా కూడా ఇవ్వనని ఆనాడు కిరణ్‌ కుమార్‌రెడ్డి హెచ్చరించారన్నారు. అది అప్రజాస్వామికమని అప్పట్లో మేం నిరసన వ్యక్తం చేశామన్నారు.

ఇప్పుడు కేసీఆర్‌ కూడా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనను వ్యతిరేకించిన వారిని కిలోమీటర్‌ లోతున పాతేస్తానని కూడా హెచ్చరించారన్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన శక్తులు, సంస్ధలే ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తున్నాయన్నారు.

అందుకే కిరణ్‌ విధానాలపై ఎలా పోరాటం చేశామో.. కేసీఆర్‌ విధానాలపై కూడా అలాగే పోరాడుతున్నామన్నారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమం చేశామో అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు నెలకొందన్నారు. 20 నెలలుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా 1,569 మంది ఆత్మబలిదానం చేసుకున్నారని నిండు సభలో పేర్కొన్న కేసీఆర్‌ వారి కుటుంబాలకు 10లక్షలు సాయం చేస్తామని, ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే కేవలం 520 మందిని మాత్రమే గుర్తించారన్నారు. అమరుల కుటుంబాలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ రేవంత్ ప్రశ్నించారు.

 చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి

సమగ్ర కుటుంబ సర్వేలో కోళ్ల కోసం కూడా ప్రత్యేక కాలమ్‌ను పొందుపరిచిన ప్రభుత్వం కుటుంబాల్లో ఎంత మంది బలిదానం చేసుకున్నారో కోరుతూ కాలమ్‌ను పెట్టకపోవడం శోచనీయమన్నారు. అమరవీరుల పేరిట స్థూపం ఏర్పాటుచేస్తామని కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు.

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి


విపక్ష ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెచ్చి, నయానో భయానో టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపరిపాలన కేంద్రమయిన సచివాలయాన్ని ఫిరాయింపుల కేంద్రంగా మార్చి విపక్ష నేతలకు అక్కడే గులాబీ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు.

 చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి


ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో పోరు టీడీపీ-బీజేపీ, టీఆర్‌ఎస్-ఎంఐఎం కూటముల మధ్యే ఉంటుందన్నారు. మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ను రెవెన్యూ పెంచే జిల్లాగా అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనన్నారు. రెండురోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని వెల్లడించారు.

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌లో 30లక్షల మంది పేదలకు ఇళ్లు అవసరమని, కేంద్ర ప్రభుత్వ సాయంతో పేదలకు ఇళ్లు, ప్రజా రవాణ వ్యవస్థ మెరుగుకు కృషిచేస్తామన్నారు. 22నుంచి 27వ తేదీ వరకు ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశతో పాటు పార్టీ రాష్ట్రనాయకులు పాల్గొంటారని తెలిపారు.

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి

చంద్రబాబు రోడ్డు షో, కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారు: రేవంత్ రెడ్డి


కాగా గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే లక్ష్యంతో అభ్యర్థులను ఎంపిక జరిగిందని, ఈ క్రమంలో కొందరికి అవకాశం రానిమాట వాస్తవమేనన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన వివిధ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు అధికార పార్టీకి ఏకపక్షం కాదని, మిశ్రమమని స్పష్టం చేశారు.

English summary
Revanth Reddy press meet at somajiguda on GHMC Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X