మైనారిటీల రిజర్వేషన్ల పై రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీ లక్ష్యంగా ఆగ్రహం వ్యక్తం చేయగా.. మైనార్టీల రిజర్వేషన్ల పైన ఆసక్తి కర ప్రశ్నలు సంధించారు. మైనారిటీలకు ఓటు హక్కును దూరం చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీని గద్దె దించడమే కాంగ్రెస్ లక్ష్యమని పునరుద్ధాటించారు. పాత బస్తీ భవిష్యత్ కు కట్టుబడి ఉన్నానని చెప్పిన రేవంత్ స్పష్టం చేసిన రేవంత్... సర్ ప్రక్రియ పైన సంచలన ఆరోపణలు చేసారు.
కేంద్రంలోని మోదీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ తొలగించాలంటున్న బీజేపీ నేతలు.. గుజరాత్లో ఎందుకు తొలగించడం లేదు? అని ప్రశ్నించారు. మైనారిటీలకు ఓటు హక్కును దూరం చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సర్ (ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ) పేరుతో మైనారిటీలు, దళితులు, పేదల ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహించారు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్లపై కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. మోదీని గద్దె దించడమే కాంగ్రెస్ లక్ష్యమని పునరుద్ధాటించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటేనని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని.. మోదీ కాళ్లపై పడింది ఎవరో అందరికీ తెలుసునని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, విద్యావ్యస్థను మౌలానా అబుల్ కలాం ఆజాద్ బలోపేతం చేశారని వ్యాఖ్యానించారు. దేశంలో వర్సిటీలతో పాటు ఐఐటీలను స్థాపించారని ప్రస్తావించారు. ఆనాటి పునాదుల వల్లే ప్రపంచవ్యాప్ తంగా భారతీయులు రాణిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. యువతలో స్కిల్స్ పెంచేందుకు ఐటీఐలను ఏటీసీలుగా మార్చామని గుర్తుచేశారు. మైనారిటీల్లో చాలామంది స్కిల్డ్ యువత ఉన్నారని చెప్పుకొచ్చారు. యువత కోసమే స్కిల్ యూనివర్సిటీని తీసుకువచ్చామని వెల్లడించారు. మైనారిటీలకు విద్యా, ఉద్యోగాల్లో కాంగ్రెస్ 4% రిజర్వేషన్ కల్పించిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications
