విజయవాడకు చేరుకున్న రేవంత్

Subscribe to Oneindia Telugu
Revanth Reddy Reached Vijayawada To Meet Chandrababu Naidu | Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో శనివారం మరోసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి శనివారం ఉదయమే విజయవాడకు చేరుకున్నారు.

బావమరిది కళ్లల్లో ఆనందం: కేటీఆర్‌పై రేవంత్ సంచలనం, పరిటాలపైనా..

మరికొద్ది సేపట్లో చంద్రబాబునాయుడుతో రేవంత్ భేటీ కానున్నారు. చంద్రబాబునాయుడు ఇతర తెలంగాణ సీనియర్ నేతలతోనూ విడి విడిగా భేటీ అయ్యే అవకాశం ఉంది. 

Revanth Reddy reaches vijayawada

పోతే పో, ఉంటే ఉండు!: రేవంత్‌కు 'బిగ్' షాక్, ఇదీ బాబు ప్లాన్, దూళిపాళ్ల సంధి ప్రయత్నం విఫలం

చంద్రబాబుతో శుక్రవారమే రేవంత్ భేటీ అయినప్పటికీ ఏమీ స్పష్టత రాకపోవడంతో మరోసారి అమరావతిలో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌ల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్.. టీడీపీలోనే కొనసాగుతారా? చంద్రబాబుకు తన పరిస్థితి వివరించింది కాంగ్రెస్ పార్టీలో చేరతారా? తేలే అవకాశం ఉంది.

రేవంత్ తోపాటు చేరుకున్న టీటీడీపీ నేతలు

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి, అరవింద్‌కుమార్‌గౌడ్‌లు కూడా విజయవాడకు వచ్చారు. కాగా, తమ భేటీలో రేవంత్‌ విషయంపైనే ప్ర‌ధానంగా చర్చ జరగనుందని అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTDP leader Revanth Reddy reached vijayawada to meet TDP president and CM Chandrababu Naidu.
Please Wait while comments are loading...