రూ. 10 కోట్లతో తీస్తే రూ. 1000 కోట్ల కలెక్షన్స్.. ఇది కదా సినిమా అంటే..!
ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది.. చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాయి. పెద్ద సినిమాలు మాత్రం ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలం అవుతున్నాయి. తెలుగులోనే కాదు హాలీవుడ్ లోనూ ఇలాంటి ట్రెండే కొనసాగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. అలాగే పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడుతున్నాయి. మరోవైపు ఓటీటీల ట్రెండ్ ప్రస్తుతం విస్తరిస్తోంది. చాలామంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడడం మానేసారనే చెప్పాలి. సినిమా పెద్ద హిట్ అయితేనే థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. లేదంటే ఓటీటీలోకి వచ్చేంతవరకూ ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. పెట్టిన బడ్జెట్ కు ఏకంగా 100 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ తో మూవీ దూసుకెళ్తోంది. అదే అబ్సెషన్ మూవీ.. మే 15 న రిలీజ్ అయిన ఈ హారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ మూవీ రూ. 1000 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. అబ్సెషన్ మూవీ బడ్జెట్ కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కావడం విశేషం..
అబ్సెషన్ మూవీ అమెరికాలో తొలి వీకెండ్ లో 17.2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక రెండోవారం కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం వరకు మరో 30 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఈ ఆదివారం నాటికి ఈ వసూల్లు సులభంగా 50 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అమెరికాతోపాటు కెనడా, ఇతర దేశాల్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది ఈ మూవీ.. ఇక భారత్ లో ఈనెల 29 న గ్రాండ్ గా విడుదల కానుంది అబ్సెషన్ మూవీ. ఇది ఓ హార్రర్ మూవీ కాగా.. 95 శాతం హార్రర్ రేటింగ్ రావడం విశేషం. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కలేదు. అలాగే స్టార్ హీరోలు కూడా సినిమాలో లేరు. కేవలం బలమైన కథతో ఎంతటి అద్భుతం చేయోచ్చో 'అబ్సెషన్' నిరూపించింది. ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications