ఈ సారి వారికి టికెట్లు ఉండవు- కేటీఆర్ సంచలన ప్రకటన..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 2 ఆవిర్భావ దినోత్స వ వేళ.. రేవంత్ ప్రభుత్వం కొత్త పథకాలు.. నిర్ణయాలు అమలు చేసేందుకు సిద్దమైంది. రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా బీఆర్ఎస్ రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. అటు బీజేపీ సైతం రాజకీయంగా కీలక అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. తిరిగి తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, 2034 ఎన్నికల వరకు తానే సీఎం గా ఉంటానని రేవంత్ పదే పదే చెబుతున్నారు. అటు బీజేపీ నేతలు సైతం ప్రజలు తమతో నే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమయంలోనే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అంబర్‌పేట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎవరికీ కూడా పలానా వారికి టిక్కెట్లు ఇస్తామని వాగ్ధానాలు చేయలేమని... ఎవరు ఎక్కువ ఉరుకుతరో.. ఎవరెక్కువ తండ్లాడుతరో.. ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తరో.. ఎవరో కార్యక్షేత్రంలో గట్టిగా మెంబర్ షిప్ చేస్తరో.. ఎవరైతే గట్టిగా ప్రజల కోసం నిలబడ తారో వారికే సీట్లు ఇస్తామని తేల్చి చెప్పారు.

 ఒకే రైలులో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం - రూట్, షెడ్యూల్..!!
ఒకే రైలులో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం - రూట్, షెడ్యూల్..!!
brs-working-president-ktr-made-interesting-comments-over-tickets-finalization-for-next-elections

వారికి మాత్రమే టికెట్లు ఇస్తాం

2023 ఎన్నికల్లో సీట్ల విషయంలో చోటు చేసుకున్న పొరపాట్లతో ఈ సారి బీఆర్ఎస్ ముందస్తుగా నే అప్రమత్తం అవుతోంది. ఎవరికీ సీట్ల విషయంలో ముందస్తు హామీలు... సిట్టింగ్ ల విషయం లోనూ క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే.. ఎవరుపార్టీ కోసం నిలబడ్తరో.. కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. పార్టీ పరంగా, ప్రజల పరంగా ఎవరికి పరపతి ఉన్నది. ప్రజలకు ఎవరి మంచి పేరున్నది. ఇవన్నీ చూసుకొని వారికే టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో.. సీట్ల విషయంలో ముందస్తుగానే ఎవరూ ఆశలు పెట్టుకోవద్దని.. పూర్తి స్థాయి సమాచారంతో సర్వేల ద్వారా ఎవరు గెలుస్తారో వారికే సీటు ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+