బాబు వద్దే రేవంత్ లేఖ?: స్పీకర్‌కు చేరకపోతే!, వ్యూహాత్మకమేనా..

Subscribe to Oneindia Telugu
  బాబు వద్దే రేవంత్ లేఖ?: వ్యూహాత్మకమేనా.. సేఫ్ గేమ్ ఆడుతున్నారా? | Oneindia Telugu

  హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి లేఖ ఇంకా స్పీకర్ కు చేరలేదని తెలుస్తోంది. స్పీకర్ ఫార్మాట్ లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఆ లేఖ ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు వద్దనే ఉన్నట్టు సమాచారం.

  కాంగ్రెస్‌కు బాహుబలి?: కాంపౌండ్ దాటితే రేవంత్‌కు గండమే!, ఇదీ పరిస్థితి..

  అమరావతిలో చంద్రబాబును కలిసిన సందర్భంగా రేవంత్ తన రాజీనామా లేఖను అందజేశారు. లేఖను నేరుగా స్పీకర్ కు పంపించకుండా చంద్రబాబుకు అందజేసి రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆ లేఖను తిరిగి తెలంగాణ స్పీకర్ కు పంపిస్తారా? లేరా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  వెరుపులేని రాజకీయమా?, వెనక్కి తగ్గడమా?: రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే!..

  నవంబర్ 2వరకు

  నవంబర్ 2వరకు

  నవంబర్ 2 వరకూ తన వద్దే రేవంత్ రాజీనామాను ఉంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం హైదరాబాద్ కు వచ్చి తెలుగుదేశం నేతలతో సమావేశమై, రేవంత్ విషయమై ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. తెలంగాణకు చెందిన టీడీపీ నాయకుల ద్వారా రేవంత్ రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపించే అవకాశాలున్నాయి.

  మరో లేఖ ఇస్తారా?

  మరో లేఖ ఇస్తారా?

  ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆ లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపకుంటే, రేవంత్ మరో లేఖను స్పీకర్ ను కలిసి ఇస్తారా? లేదా? అన్నది కూడా చూడాలి. రేవంత్ గనుక పునరాలోచనలో పడితే నిర్ణయం వేరుగా ఉండవచ్చు. అయితే ఎలాగూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి రేవంత్ అదే దూకుడును కొనసాగించే అవకాశం లేకపోలేదు.

  ఫిరాయింపులపై రేవంత్ విమర్శలు

  ఫిరాయింపులపై రేవంత్ విమర్శలు

  పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ నేతలపై రేవంత్ తొలి నుంచి మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఏపీలోను చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించడంతో.. రేవంత్ విమర్శలపై ఎదురుదాడి కూడా మొదలైంది.
  ఆఖరికి చంద్రబాబే కల్పించుకుని.. ఫిరాయింపులపై రేవంత్ ను సుప్రీం గడప తొక్కకుండా చేశారు. దీంతో రేవంత్ దూకుడుకు బ్రేక్ పడ్డట్టయింది.

  అలా చేయడంలో ఆంతర్యం

  అలా చేయడంలో ఆంతర్యం

  ఒకప్పుడు తాను విమర్శించిన నేతలంతా ఇప్పుడు తనను విమర్శించే ఛాన్స్ ఉన్నందునా.. వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదని రేవంత్ భావించారు. అందువల్లే అటు పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించకుండా బాబుకు అందజేయడంలో ఆంతర్యం అంతుపట్టడం లేదు.

  లేఖ స్పీకర్ కు అందితే తప్ప ఉపఎన్నిక జరిగే అవకాశాలు ఉండవు. కాబట్టి రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా? అన్న అనుమానం కూడా కలుగుతోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy resignation letter of MLA post is still at AP CM Chandrababu Naidu, is it strategical?

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి