వ్యవస్థల నిర్లక్ష్యం ప్రీతి ప్రాణాన్ని బలిగొంది: రేవంత్ రెడ్డి; ఇది హత్యే: తెలంగాణా కాంగ్రెస్!!

మెడికో ప్రీతి మృతిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇది హత్య అని తెలంగాణ కాంగ్రెస్ పేర్కొనగా, వ్యవస్థల నిర్లక్ష్యమే ప్రీతి ప్రాణాలను బలిగొందని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు.

కాకతీయ మెడికల్ కళాశాల పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. అధికార పార్టీ ప్రీతిని వేధింపులకు గురి చేసిన సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రీతి మృతి చెందిందని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఇది ముమ్మాటికీ హత్యే, దీనికి ప్రభుత్వానిదే బాధ్యత అని టార్గెట్ చేస్తున్నారు.

ఫిర్యాదు పై స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు: రేవంత్ రెడ్డి

ఫిర్యాదు పై స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు: రేవంత్ రెడ్డి


ఇక తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైద్య విద్యార్థిని ప్రీతి మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రీతి ఫిర్యాదు పై స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవస్థల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయిందని, వ్యవస్థల నిర్లక్ష్యమే ప్రాణాన్ని బలిగొందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యువత ఎట్టి పరిస్థితులలోనూ ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యలపై పోరాడాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య: తెలంగాణా కాంగ్రెస్

పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య: తెలంగాణా కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రీతి మరణం గురించి స్పందించింది. మెడికో ప్రీతి తనను వేధిస్తున్నారని తనకు రక్షణ కల్పించాలని కేసీఆర్ గులాం పోలీసులను ఆశ్రయించింది. కెసిఆర్ పోలీసులు రాజకీయ ఒత్తిడిలకు లొంగి ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదు. ఇది పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య గానే భావించాలి.. లేకుంటే ఇవాళ ప్రీతి బతికి ఉండేది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టింది.

రాక్షస కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి: తెలంగాణా యూత్ కాంగ్రెస్

రాక్షస కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి: తెలంగాణా యూత్ కాంగ్రెస్

ఇదిలా ఉంటే తెలంగాణ యూత్ కాంగ్రెస్ కూడా ప్రీతి మృతి పై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ర్యాగింగ్ భూతానికి బలైన మెడికో ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అంటూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రకటించింది. రాక్షస కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి, నిందితులకు వేగంగా, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది. మొత్తంగా చూస్తే ప్రీతి మృతికి కెసిఆర్ సర్కార్ నిర్లక్ష్యం కారణమని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే, సరైన సమయంలో పోలీసులు, కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ఇంత దారుణం జరిగిందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+