వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమిటిది రేవంత్ రెడ్డీ...: అక్కడ జగన్‌తో వారు, ఇక్కడేమో ఇలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కత్తులు నూరుతున్న సిపిఎంతో తెలంగాణలో తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్నేహం చేస్తుండడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఇరు రాష్ట్రాల్లో ఆ పార్టీ భిన్న వైఖరులు ప్రదర్శించడాన్ని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబుపై పోరాటం చేస్తున్న సిపిఎంకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్దతు ఇస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న సిపిఎంకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు. సిపిఎం పట్ల తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వైఖరి భిన్నంగా ఉండడం ప్రశ్నలకు దారి తీస్తోంది.

రేవంత్ రెడ్డి వైఖరిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేస్తున్నారు.

Revanth Reddy's stand in Telangana questioned

ఈ నేపథ్యంలో తమ్మినేని పాదయాత్రకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆ సందర్భంగా కెసిఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ తమకూ వర్తించేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. సిపిఎం నేత తమ్మినేనిని అణచివేసే పద్ధతిని కెసిఆర్ మానుకోవాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం తీవ్ర స్థాయిలో పోరాటం కొనసాగిస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పార్కు బాధితుల పక్షాన పోరాడిన సిపిఎం ఏపి కార్యదర్శి పెనుమల్లి మధును ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని జగన్ ఖండించారు. మధును ఆయన ఫోన్‌లో పరామర్శించారు కూడా.

రానున్న ఎన్నికల్లో ఏపిలో సిపిఎం, వైకాపా కలిసి పోటీచేసే అవకాశాలు ఉన్నాయని, ఈ స్థితిలో రేవంత్ రెడ్డి తెలంగాణలో సిపిఎంకు మద్దతిస్తే తమకు ఇబ్బంది కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. తమ వైఖరిని తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రశ్నించడం ప్రారంభిస్తే తాము ఏం సమాధానం చెప్పుకోవాలని అడుగుతున్నారు.

English summary
Andhra Pradesh Telugu Desam Party leaders unhappy with Telangana TDP leader Revanth Reddy's stand on CPM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X