అల్లుడు కాకముందే నా కూతురు ఐటీ చెల్లిస్తోంది: రేవంత్ మామ, ఓటుకు నోటుపై...
హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, అతని బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇది రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేకాదు, రాజకీయాల్లోకి రాకముందే తనకు ఆస్తులు ఉన్నాయని, తనకు పిల్లనిచ్చిన మామ కూడా కోటీశ్వరుడు అని రేవంత్ వెల్లడించారు. 2001 నుంచి కేసీఆర్ ఆస్తులు, 2007 నుంచి తన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని కూడా సవాల్ చేశారు. తాజాగా, ఐటీ సోదాలపై రేవంత్ మామ పద్మనాభ రెడ్డి స్పందించారు.

రేవంత్ నాకు అల్లుడు కాకముందే కూతురు గీత ఐటీ చెల్లింపు
రేవంత్ రెడ్డి తనకు అల్లుడు కాకముందు నుంచే తన కూతురు గీత పేరు మీద ఆదాయపన్ను చెల్లిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో ఉన్న ఇళ్లు తన కూతురు గీతవేనని ఆయన చెప్పారు. తన అల్లుడు రేవంత్ రెడ్డి ఆస్తుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగితే అన్ని వివరాలు వెల్లడించానని చెప్పారు.

ఓటుకు నోటు గురించి తెలియదని చెప్పా
ఓటుకు నోటు కేసు గురించి అధికారులు అడిగారని, ఆ విషయం గురించి తనకు ఏదీ తెలియదని, అదే విషయం చెప్పానని అన్నారు. తనకు మళ్లీ కొన్ని ప్రశ్నలతో నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ నెల 20వ తేదీలోగా వివరణ ఇవ్వమని చెప్పారని అన్నారు.

ఓటుకు నోటు కేసులో కోర్టుకు సెబాస్టియన్
ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ ఏసీబీ కోర్టుకు సోమవారం హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సిన్హా తదితరులు హాజరు కాలేదు. అనంతరం కేసు విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు.

సమాధానం ఎవరు చెబుతారు?
మరోవైపు, ఐటీ కార్యాలయంలో ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్ సిన్హాను విచారించారు. ఐటీ అధికారుల ప్రశ్నలపై ఆయన సమయం కోరారు. 3వ తేదీ వరకు అధికారులు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిన్న చైతన్యపురిలో తన బంధువు రణదీర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయని, అధికారులమని చెప్పి 15 మంది సోదాలు చేశారని, బంగారం, నగదు, సెల్ ఫోన్లు తీసుకెళ్లారని, దీనిపై ఐటీ అధికారులను అడిగితే తాము సోదాలు చేయలేదని చెప్పారని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేక ఐటీ అధికారులు వహిస్తారా చెప్పాలని, రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ సోదాలు అన్నారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!












Click it and Unblock the Notifications