చీలిన కాంగ్రెస్.. కేసీఆర్ వైపు ఓ వర్గం, తెలంగాణ కోసం కోర్టుకెళ్లని బాబు: రేవంత్
కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని, ఓ వర్గం అధికార తెరాస పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా పని చేస్తోందని రేవంత్ రెడ్డి బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని, ఓ వర్గం అధికార తెరాస పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా పని చేస్తోందని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్ పైన తాము అవిశ్వాస తీర్మానం పెడతామని, కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి రావాలన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలన్నారు. నకిలీ విత్తనాల కంపెనీల పైన ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీ కేసీఆర్ భవన్‌గా మారిందని రేవంత్ రెడ్డి, మరో టిడిపి నేత సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. సీఎం కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గంగా చీలిపోయిందన్నారు.

చంద్రబాబు వల్లే తెలంగాణలో విద్యుత్ వెలుగులు అని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు అధికంగా విద్యుత్ వాటా కేటాయించడంపై కోర్టుకు వెళ్దామని కొందరు చంద్రబాబుకు సూచించారని, కానీ తెలంగాణ మేలు కోసం ఆయన కోర్టుకు వెళ్లలేదన్నారు.
ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు పట్టించుకోవడం లేదన్నారు. రైతు రుణమాఫీలో ఎక్కువ భాగం వడ్డీకే సరిపోతుందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు.
రూ. 791 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ దారిమళ్లించారన్నారు. నకిలీ విత్తన కంపెనీలు రాష్ట్రంలో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోవడం లేదని, పైగా వాటిపై చర్యలు తీసుకోవాలన్న కమిషనర్‌ను సెలవుపై పంపారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications