ఎన్ని కష్టాలైనా పడ్తా, టిడిపిని వీడను: రేవంత్, టిఆర్ఎస్‌లోకి టిడిపి మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్/నిజామాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్మూర్ పట్టణంలో గల తలారి సత్యం ఇంటికి ఆయన రానున్నారు. రేవంత్ పర్యటన సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని పార్టీ శ్రేణులను కోరారు.
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండవచ్చుగానీ, ఎల్లకాలం ఉండదని రేవంత్ రెడ్డి అంతకుముందు వ్యాఖ్యానించారు. ఎన్నికష్టాలైనా పడతానే తప్ప, తాను పార్టీని వదిలే సమస్యే లేదని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యేలు వివేక్, రాజేందర్ రెడ్డిలు టిడిపిని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు బాధను కలిగించిందన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో స్వార్థరాజకీయాల కోసం వారు పార్టీని వీడారన్నారు. స్వార్థపరులు వెళ్తే, బాధపడాల్సింది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని, కిందిస్థాయి నేతలు పైకెదిగే అవకాశాలు ఉన్నాయన్నారు.

టిఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర రావు
మాజీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో ఆయన సమావేశమయ్యారు. పోట్ల టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై చర్చించారు. మంత్రి స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలో వీరిద్దరూ భవిష్యత్ ప్రణాళికపై సమాలోచన చేశారు.
ఇక టీడీపీకి రాజీనామా చేసి ఈ నెల 15న టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు పోట్ల నాగేశ్వరరావు ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో నాగేశ్వర రావు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల చేపడుతున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాలు చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications