నమస్తే తెలంగాణ పత్రికే కాదు, జగన్, కెటీఆర్ మధ్య ఒప్పందం వల్లే: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమ ఛానెళ్లలో వార్తలను ప్రసారం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లఘింస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

తమ అభ్యర్థికి మద్దతుగా టీన్యూస్, నమస్తేతెలంగాణ పత్రికల్లో వస్తున్న వార్తలను పెయిడ్‌న్యూస్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. నమస్తే తెలంగాణ వార్తాపత్రిక కాదనీ దాన్ని కరపత్రంగా తాము భావిస్తున్నామని అన్నారు.

 Revanth Reddy says Namasthe Telangana news should be considered as paid news

ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి పరిమితి కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ వెంటనే అతడిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు వరంగల్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

కేంద్ర బృందం వచ్చి ఎన్నికల ప్రచారంలో అవకతవకలను పరిశీలించాలని రేవంత్ రెడ్డి కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

వరంగల్ పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురిగిపోయినట్టేనని రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలన బాగుందని కాంగ్రెస్‌ మనసులోమాటను సీనియర్ నేత ఎమ్మెస్సార్‌ బయటపెట్టారని, అయితే ఈ ప్రకటనను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించకపోగా, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఖండించలేదన్నారు.

కేటీఆర్‌-జగన్‌ మధ్య వాటర్‌గ్రిడ్‌ ఒప్పందంలో భాగంగానే వరంగల్‌ ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తోందన్నారు. అలాగే కేంద్రం నుంచి అత్యధిక నిధులు రావాలన్నా కేంద్రంలో మరో మంత్రి పదవి కావాలన్నా ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+