ఎర్రబెల్లి ఏబీసీడీలు రాస్తే.. ఆ పని చేస్తా: మంత్రి ఇలాకాలో రేవంత్ రెడ్డి సవాల్!!

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏబీసీడీలు రాస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ పాలకుర్తి సభలో రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేశారు. ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ రేవంత్ రెడ్డి ఎర్రబెల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో పర్యటిస్తున్న టిపిసిసి రేవంత్ రెడ్డి పాలకుర్తి చౌరస్తాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సవాల్ విసిరారు.

 ఎర్రబెల్లికి రేవంత్ రెడ్డి సవాల్

ఎర్రబెల్లికి రేవంత్ రెడ్డి సవాల్


ఎర్రబెల్లి దయాకర్ రావు ఓనమాలు, ఏబిసిడిలు రాస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. పౌరుషం గల ఈ గడ్డమీద పలక బలపం ఇస్తే ఓనమాలు రాయనోడు ఎమ్మెల్యే కావడం విచారకరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాత్రి పాలకుర్తి చౌరస్తాలో జరిగిన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లికి చదువు రాదని ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు ఆయనకు విప్ గా అవకాశం ఇస్తే విస్మరించి కెసిఆర్ రాచరిక పాలన కోసం పావుగా పనిచేశారని, అందుకే ఈరోజు మంత్రి అయ్యాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

టీడీపీని ముంచిన దుర్మార్గుడు ఎర్రబెల్లి

టీడీపీని ముంచిన దుర్మార్గుడు ఎర్రబెల్లి


ఎర్రబెల్లి దయాకర్ రావు వెన్నుపోటు దారుడని, పాలకుర్తిలో డాక్టర్ సుధాకర్ రావును వెన్నుపోటు పొడిచాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డాక్టర్ సుధాకర్ రావు ఉన్నప్పుడే బావా బావా అని తిరుగుతుంటే వెన్నుపోటు పొడుస్తాడని చెప్పినా నమ్మలేదని, ఎర్రబెల్లి పొడిచిన వెన్నుపోటుతో డాక్టర్ సుధాకర్ రావు కనుమరుగయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ముంచిన దుర్మార్గుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చదువు రాని ఎర్రబెల్లికి చాలా ప్రాధాన్యతనిస్తే ఎర్రబెల్లి కోవర్టులా మారి పార్టీకి తీరని నష్టం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

 టీడీపీ తరహాలోనే బీఆర్ఎస్ కు బొంద పెడతాడు .. కేసీఆర్ జాగ్రత్త

టీడీపీ తరహాలోనే బీఆర్ఎస్ కు బొంద పెడతాడు .. కేసీఆర్ జాగ్రత్త


నాడు టిడిపి తరహాలోనే నేడు బిఆర్ఎస్ పార్టీని కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు బొంద పెడతాడని, జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ ను ఆయన హెచ్చరించారు. ఎర్రబెల్లి వైఖరి పై ఒక చిన్న కథ చెప్పిన రేవంత్ రెడ్డి కెసిఆర్, ఎర్రబెల్లి కలిసి మేడారం అడవులకు వెళితే, పులి ఎదురైతే... కెసిఆర్ ను కాపాడాల్సింది పోయి ఎర్రబెల్లి బూట్లు సదురుకుంటున్నట్టు నమ్మబలికి కెసిఆర్ ను పులికి బలి ఇస్తాడు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి వైఖరి అలా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

ధరణి పోర్టల్ ద్వారా బినామీ ఆస్తులు కూడబెడుతున్న ఎర్రబెల్లి

ధరణి పోర్టల్ ద్వారా బినామీ ఆస్తులు కూడబెడుతున్న ఎర్రబెల్లి


ఇక ధరణి పోర్టల్ ద్వారా బి ఆర్ ఎస్ నాయకులు భూదందాలు చేసి మంత్రి ఎర్రబెల్లికి బినామీ ఆస్తులను కూడబెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చెన్నూరు రిజర్వాయర్ టెండర్ డబల్ చేసి ఎర్రబెల్లి కమిషన్లు నొక్కాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వ రాగానే ధరణి ద్వారా దోపిడీ చేసిన వారిని, భూ దందాలు చేసే వారిని జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. సబ్బండవర్ణాలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రాచరిక పోకడలతో పరిపాలిస్తున్న కేసీఆర్ దుష్ట పాలనకు చరమగీతం పడాల్సిన సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికలలో ప్రజలు ఆ పని చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+