• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకే: కేసీఆర్, బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అదే సమయంలో బీజేపీపైనా విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్‌మీట్లు కల్లు కాంపౌండ్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కొంపల్లిలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరంలో రేవంత్ రెడ్డి బుధవారం మాట్లాడారు.

కేసీఆర్ ముక్కలు చేస్తా అన్నా మాట్లాడరా?: రేవంత్

కేసీఆర్ ముక్కలు చేస్తా అన్నా మాట్లాడరా?: రేవంత్


భవిష్యత్‌లో ఇంకా చాలా శిక్షణా తరగ తులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోనియా గాంధీ ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏఐసీసీ ఫ్లీనరీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని రేవంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీపై నిప్పులు చెరిగారు. నీళ్లు, నిధులపేరుతో కేసీఆర్‌ కోట్ల అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్‌ను కేసీఆర్ 6 ముక్కలు చేస్తా అన్నా.. అరవింద్, బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకేనంటూ రేవంత్

కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకేనంటూ రేవంత్


కాంగ్రెస్ పార్టీ చర్చలో లేకుండా ఉండేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పొలిటికల్‌ డ్రామాలు ఆడుతున్నాయన్నారు రేవంత్. కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకుందని రేవంత్ అన్నారు . అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ బండి సంజయ్‌కు ఇప్పిస్తారా? అని ప్రశ్నించారు. మోడీ, అమిత్‌ షాలకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు రేవంత్.

కేసీఆర్, బీజేపీలపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

కేసీఆర్, బీజేపీలపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు


'కిషన్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా.. మీరు సీబీఐ ఎంక్వరీ వేయండి, కేసీఆర్ అవినీతిని నేను నిరూపించకుంటే రాజకీ యాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా' అని రేవంత్‌ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కిషన్ రెడ్డి తరలించాడు. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ఖర్చు కేసీఆర్‌ పెట్టు కున్నాడంటూ రేవంత్ ఆరోపణలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగిని మరోసారి చేసేందుకు కేసీఆర్ మోడీతో ఒప్పందం చేసుకున్నారు. అక్కడ ఎంఐఎం చేత వంద సీట్లకు పోటీ చేయించి ప్రతిపక్ష ఓట్లను చీల్చి బీజేపీ మళ్ళీ అధికా రంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. పవర్ ప్రాజెక్టులలో కేసీఆర్ వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడని రేవంత్ ఆరోపించారు.

టీఆర్ఎస్ అవినీతిపై విచారణ: బీజేపీకి ధైర్యముందా అంటూ రేవంత్

టీఆర్ఎస్ అవినీతిపై విచారణ: బీజేపీకి ధైర్యముందా అంటూ రేవంత్


గచ్చిబౌలి, నార్సింగిలలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు,బెల్లంలా కేసీఆర్ తన మనుషులకు కట్టబెట్టాడని రేవంత్ ఆరోపించారు. పవర్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని బీజేపీ మాజీ అధ్య క్షుడు లక్ష్మణ్ ఆరోపించినప్పుడు.. తాను ఆధారాలు ఇస్తా అని చెప్పి తన.. ఇప్పుడు బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్‌లో ఉన్న సంజీవ య్య పార్క్‌ను మంత్రి తలసాని ఆక్రమించాడు. విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీకి ఉందా? అని రేవంత్ నిలదీశారు. అమరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో అధికారం చెలాయిస్తున్న కేసీఆర్.. ఏనాడైనా అమరుల కుటుంబాలను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న అమరవీరుల స్థూపంలో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందన్నారు రేవంత్. గ్రామాల్లో యువతను, ప్రజలను చైతన్యవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

English summary
TPCC chief Revanth Reddy slams CM KCR and BJP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X