వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 జనవరిలో తెలంగాణే లేదు: రేవంత్ ఝలక్, నా వందల ఎకరాలు పోయాయి: కేసీఆర్

కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన భూసేకరణ చట్టం పైన బుధవారం శాసన సభలో అంతకుముందు చర్చ సమయంలో తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన భూసేకరణ చట్టం పైన బుధవారం శాసన సభలో అంతకుముందు చర్చ సమయంలో తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొంచెం మైండ్ పెట్టి పని చేయాలని సూచించారు.

నష్టం తప్పదు, కిరణ్ రెడ్డి అహంకారం.. అదీ మన పరిస్థితి: కేసీఆర్, పనికి రానివినష్టం తప్పదు, కిరణ్ రెడ్డి అహంకారం.. అదీ మన పరిస్థితి: కేసీఆర్, పనికి రానివి

రైతుల హక్కులను ప్రభుత్వం లాగేసుకుంటోందన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం 2013 భూసేకరణ చట్టాన్ని తెచ్చారని, అందరికీ హక్కులు కల్పిస్తూ గత చట్టం ఉందన్నారు. 2013 చట్టంలో రైతులకు కల్పించిన రక్,ణను లాగేసుకుంటారా అని ప్రశ్నించారు.

revanth reddy

మంత్రులు, అధికారులు మైండ్ పెట్టి పని చేయాలన్నారు. యాక్టులో కీలకమైన సెక్షన్ 2, 3లను తొలగించాలన్నారు. రెండు పంటలు పండే భూములు తీసుకోవద్దని యాక్టులో ఉందన్నారు. 80 శాతం ప్రజల ఆమోదంతో ప్రాజెక్టు నిర్మించాలన్నారు.

ఈ ప్రభుత్వం పార్లమెంట్‌ చట్టాన్ని కాలరాసి, పేదల భూముల కబ్జా చట్టం తెచ్చిందని సభ అనంతరం మీడియా పాయింట్ వద్ద అన్నారు. శాసనసభకు ఇది చీకటి రోజు అన్నారు. జీవోలతో పేదల భూములు లాక్కునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందన్నారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారమే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. 2014 జనవరి 1న తెలంగాణ రాష్ట్రమే లేదని, అప్పటి నుంచి అమలయ్యేలా చట్టం చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సభాపతి తన ధర్మాన్ని నిర్వర్తించాలంటే సీఎం, సాగునీటి మంత్రిపై హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ను టార్గెట్ ఎఫెక్ట్: కోదండరాంను అంతమాట అనేశారు!కేసీఆర్‌ను టార్గెట్ ఎఫెక్ట్: కోదండరాంను అంతమాట అనేశారు!

సభలో ప్రవేశపెట్టిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఆమోదించవద్దని గవర్నర్‌, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కేసీఆర్‌ ఎంపీగా ఉన్నప్పుడు 2013 భూసేకరణ చట్టం వచ్చిందని, దాన్ని తాడు బొంగరం లేని చట్టం అని ఇప్పుడు ఎలా అంటారన్నారు.

కాగా, అంతకుముందు సభలో కేసీఆర్ భూసేకరణ చట్టం బిల్లుపై మాట్లాడారు. భూసేకరణ చట్టం కింద తనవి కూడా గతంలో వంద ఎకరాలు పోయాయని, భూమి పోతే ఎలాంటి బాధ ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. అప్పర్ మానేరులో తాను వందల ఎకరాలు కోల్పోయానని చెప్పారు.

English summary
Revanth Reddy slams TRS government land acquisition Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X