రేవంత్ కు షాక్: చింతమడకలో టిఆర్ఎస్ నిరసన, కాలినడకనే ....

Posted By:
Subscribe to Oneindia Telugu

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వంత గ్రామం చింతమడకలో ఆత్మహాత్య చేసుకొన్న మహిళా రైతును పరామర్శించేందుకు వెళ్ళిన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని గ్రామస్థులు అడ్డుకొన్నారు. రేవంత్ రెడ్డి బృందాన్ని గ్రామంలోకి రాకుండా ముళ్ళు, రాళ్ళు అడ్డుపెట్టారు.దీంతో పోలీసులు రేవంత్ కాన్వాయ్ ను నిలిపివేశారు.కాలినడకనే రేవంత్ గ్రామంలోకి వెళ్ళారు.గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ముఖ్యమంత్రి కెసిఆర్ స్వంత గ్రామం చింతమడకలో బుదవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకొన్నాయి. ఈ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకుగాను రేవంత్ రెడ్డి బుదవారం సాయంత్రం ఆ గ్రామానికి వెళ్ళారు.

రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ తో గ్రామానికి వెళ్ళాడు.అయితే రేవంత్ రెడ్డిని తమ గ్రామానికి రాకుండా టిఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ ను గ్రామంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఊరికి వెలుపలే ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు.

Revanth reddy stopped before 2 k.m of Chintamadaka village

అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున గ్రామంలోకి వెళ్ళకూడదంటూ పోలీసులు రేవంత్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకొన్నారు.దీంతో రేవంత్ రెడ్డి కారును వదిలి కాలినడకనే గ్రామంలోకి వెళ్ళారు. అయితే చింతమడకకు టిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకొన్నారు.రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో రేవంత్ రెడ్డి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలువరించారు.అయితే బాధిత కుటుంబాన్ని రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువచ్చారు పోలీసులు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హారీష్ రావు తీరును తప్పుబట్టిన రేవంత్ రెడ్డి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp Telangana working president Revanth reddy stopped before 2 k.m of Chintamadaka village on Wednesday.Trs workers protested for Revanth Reddy visiting Chintamadaka village.
Please Wait while comments are loading...