'కేసీఆర్ పతనం మొదలైంది.. నిరంకుశత్వంతో వెళ్తే పుట్టగతులుండవ్'

నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న విద్యార్థులను అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరమైన చర్య అని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులతో కోదండరాంతో సహా పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీర్ పతనం మొదలైందని జోస్యం చెప్పిన ఆయన.. మున్ముందు ఆయనకు పుట్టగతులు ఉండబోవని విమర్శించారు.

Revanth Reddy takes on KCR over the arrests of kodandaram and students

నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న విద్యార్థులను అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరమైన చర్య అని అభిప్రాయపడ్డారు. నిర్బంధాలతో నిరుద్యోగులను అణిచేయాలని ప్రయత్నిస్తే గట్టి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమ సందర్బాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఆనాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు ఈనాడు ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. నిరంకుశత్వంతో, నియంతృత్వ పోకడలతో పాలన కొనసాగించినవారెవరూ చరిత్రలో మిగల్లేదన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తెరగాలని రేవంత్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+