ఆ గ్రామంలో రూపురేఖలు మార్చేశారా?: కెసిఆర్‌కు రేవంత్ రెడ్డి షాక్

కరీంనగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం నాడు టిడిపి, టిఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీల నాయకులతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేశారని చెప్పవచ్చు.

ఆయన సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్ గ్రామంలో పర్యటించారు. ఇప్పటికే ఐ వైపు తెరాస ఆపరేషన్ ఆకర్ష్ వల్ల తెలంగాణ టిడిపి నేతలు కారు ఎక్కుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా ఆ పార్టీ చతికిలపడింది.

Also Read: రివర్స్: బాబు హింట్, జగన్‌తో గేమ్: 'వాచీ లేకుండా లోకేష్‌ని ఎలా చదివించారు'

టిడిపి నుంచి ఎర్రబెల్లి దయాకర రావు వంటి సీనియర్ నేతలు చాలామంది వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో టిడిపి బాధ్యతను రేవంత్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. ఎంతమంది కీలక నేతలు పార్టీ వీడిని భయం లేదని, భవిష్యత్తు టిడిపిదేనని, 2019లో మేమే అధికారంలోకి వస్తామని చెబుతూ కార్యకర్తల్లో ధైర్యం నూరిపోస్తున్నారు.

Revanth Reddy visits CM KCR adopted village

టిఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తాను తగ్గేది లేదని ఆయన ఇటీవల చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం రేవంత్ సీఎం కెసిఆర్‌ను టార్గెట్ చేశారు. రేవంత్ ఈ రోజు కెసిఆర్ దత్తత తీసుకున్న గ్రామం చిన్నముల్కనూర్‌లో పర్యటించారు. కరీంనగర్ జిల్లాలోని ఈ గ్రామాన్ని కెసిఆర్ దత్తత తీసుకున్నారు.

గ్రామ రూపురేఖలే మార్చేస్తానని దత్తత సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఆ గ్రామంలో రేవంత్ రెడ్డి కాలు మోపారు. గ్రామంలో జరుగుతున్న పలు కార్యక్రమాలను నిశితంగా పరిశీలించారు. కేసీఆర్ దత్తత గ్రామంలో జరుగుతున్న పనులనే పరిశీలించేందుకు వెళ్లిన రేవంత్.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

భారత చట్టాలు గౌరవించే వాళ్లే ఈ దేశంలో ఉండాలి: కిషన్ రెడ్డి

భారత జట్టాలను గౌరవించే వాళ్లే ఈ దేశంలో ఉండాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన ఢిల్లీలోని జెఎన్‌యు వివాదంపై ఘాటుగా స్పందించారు. గాంధీ పేరు పెట్టుకునే అర్హత ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి లేదన్నారు. దివాళాకోరు రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.

జెఎన్‌యు వివాదంపై చర్చకు ప్రభుత్వం సిద్ధం: వెంకయ్య

జెఎన్‌యువివాదంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో అన్నారు. బడ్జెట్‌ సమావేశాలపై నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జెఎన్‌యు వివాదంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, చర్చల ద్వారానే సమాధానం వస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+