టీఆర్ఎస్ కు ఇదో గుణపాఠం, తీర్పును లెక్క చేయకపోతే పోరాటమే : రేవంత్
హైదరాబాద్ : భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో-123 ని హైకోర్టు కొట్టివేయడంతో.. హైకోర్టు తీర్పుపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై స్పందించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఈ తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ గుణపాఠం లాంటిదని అభివర్ఱించారు.
తాజా తీర్పు ద్వారా ప్రభుత్వ తప్పిదాన్ని హైకోర్టు చక్కదిద్దిందని.. ఒకవేళ హైకోర్టు తీర్పును లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు రేవంత్. న్యాయస్థానం తీర్పును తూచ తప్పకుండా ఆచరించాల్సిందేనని ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తే తామే పోరాటంలోకి దిగుతామని ప్రకటించారు రేవంత్.













Click it and Unblock the Notifications