హైదరాబాద్ పాతబస్తీకి మెట్రో రైలు: రూట్ మ్యాప్ ఇదే: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ
Old City Metro Rail Project: హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్ తెరపైకి రాబోతోంది. పాతబస్తీవాసుల కల నెరవేరబోతోంది. పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు పెట్టబోతోంది. దీనికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేసింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్‌స్టేషన్- మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్ నిర్మితమైంది. రోజూ వేలాదిమంది ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటోన్నారు.

దీన్ని మరింత విస్తరించబోతోంది ప్రభుత్వం. ఓల్డ్ సిటీకీ మెట్రో రైలును పరిచయం చేయబోతోంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ నెల 8వ తేదీన పాతబస్తీలోని ఫలక్‌నుమా వద్ద రేవంత్ రెడ్డి- ఓల్డ్ సిటీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనా 2,000 కోట్ల రూపాయలు. రోడ్డు విస్తరణ పనులను చేపట్టడం, ఇందులో తమ నివాసాలు, ఇతర వాణిజ్య భవన సముదాయాలను కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది ప్రభుత్వం. సుమారుగా 100 అడుగుల వరకు రోడ్డును వెడల్పు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
దారుల్‌షిఫా- ఫలక్‌నుమా మధ్య ఈ నాలుగో మెట్రో రైల్ కారిడార్ అందుబాటులోకి రానుంది. దారుల్‌షిఫా నుంచి ఆరంభం అయ్యే మెట్రో రైళ్లు.. పురానీ హవేలి- ఐత్బార్ చౌక్- అలీజా కోట్లా- మిర్ మొమిన్ దాయిరా- హరీ బౌలి- షాలిబండ- షంషేర్‌గంజ్- ఆలియాబాద్ మీదుగా ఫలక్‌నుమాకు చేరుకుంటాయి.
చంద్రాయనగుట్ట ఓ మేజర్ ఇంటర్ ఎక్స్ఛేంజ్ స్టేషన్‌గా రూపుదిద్దుకోనుంది. అటు నాగోల్, ఇటు ఎల్బీ నగర్ వైపు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేవారికి చంద్రాయనగుట్ట వద్ద రైలు మారేలా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నాగోల్- ఎల్బీనగర్- చంద్రాయనగుట్ట- మైలార్‌దేవ్ పల్లి- పీ7 రోడ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ లభిస్తుంది.
ఈ మార్గంలో సుమారుగా 1,100 వరకు నివాసాలు, ఇతర వాణిజ్య భవన సముదాయాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తోన్నారు. వాటన్నింటినీ తొలగించడానికి అవసరమైన చర్యలను త్వరలోనే చేపట్టనున్నారు. ఈ మార్గంలో కొన్ని చారిత్రక, వారసత్వ కట్టడాలకు ఎలాంటి నష్టం కలగకుండా రోడ్డు విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications