రాజీనామాపై రేవంత్ మౌనం: గెలిస్తే మైలేజీ, ఓడిపోతే కాంగ్రెస్‌కు నష్టం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి టిడిపిని వీడిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యవహరం ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారింది. అయితే కొడంగల్ ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఇప్పట్లో కన్పించడం లేదు. యథాతథస్థితి కొనసాగితేనే ప్రయోజనంగా ఉంటుందనే అభిప్రాయాలను కొందరు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.అయితే వ్యూహత్మకంగానే రేవంత్‌రెడ్డి తన రాజీనామా విషయమై నోరు మెదపడం లేదనే ప్రచారం కూడ సాగుతోంది.

రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్

రేవంత్‌రెడ్డి గత నెల 31వ, తేదిన సుమారు 16 మంది టిడిపికి చెందిన ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మోత్కుపల్లి: రేవంత్‌కు చెక్‌ కోసమే టిఆర్ఎస్ పొత్తు, ఒంటరి పోరేనా?

టిడిపికి రాజీనామా చేసిన సమయంలోనే రేవంత్‌రెడ్డి స్పీకర్‌కు కూడ రాజీనామా లేఖను రాశారు. అయితే ఈ లేఖను రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయంలో అందించినట్టు ప్రచారం సాగింది.

రేవంత్‌కు మోత్కుపల్లి షాక్: 'మురికిపోయింది, ప్రజలే బుద్ది చెబుతారు'

ఈ ప్రచారాన్ని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి చెబతున్నట్టుగా రాజీనామా లేఖను చంద్రబాబునాయుడు కార్యాలయంలో ఇవ్వలేదని స్పష్టం చేశారు.

రేవంత్‌ దెబ్బ: ఆ లేఖ ఎక్కడుంది, చంద్రులకు చుక్కలేనా?

కొడంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేతలిలా..

కొడంగల్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేతలిలా..

రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ ఇంతవరకు తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. అయితే రేవంత్ మాత్రం గన్‌మెన్లను, ప్రభుత్వం ఇచ్చిన పిఎను వెనక్కి పంపారు. క్వార్టర్‌ను కూడ తిరిగి ఇవ్వనున్నారు.కొడంగల్ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది.ఇప్పటికే టిఆర్ఎస్ ఈ నియోజకవర్గంపై కేంద్రీకరించింది.రేవంత్‌రెడ్డి అనుచరులను టిఆర్ఎస్ తమ పార్టీలోకి చేర్చుకొనే పనిని చేపట్టింది.అయితే కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగి రేవంత్‌రెడ్డి విజయం సాధిస్తే రేవంత్‌రెడ్డికి వ్యక్తిగత మైలేజీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఒక వేళ ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగి రేవంత్ ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. దీంతో ప్రస్తుతమున్న పరిస్థితి కొనసాగితే మేలనే అభిప్రాయంతో కొందరు కాంగ్రరెస్ నేతలున్నారని సమాచారం.

 కొడంగల్‌కు ఉపఎన్నికలు వచ్చేనా

కొడంగల్‌కు ఉపఎన్నికలు వచ్చేనా

రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరితే ఈ విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకొంటారు. అయితే రేవంత్‌రెడ్డి మాత్రం రాజీనామా విషయమై ఇంతవరకు నోరు మెదపడం లేదు. ఒక పార్టీ నుండి విజయం సాధించి మరో పార్టీలో చేరే సమయంలో పదవులకు రాజీనామా చేయడం నైతికత. అయితే రేవంత్‌రెడ్డి రాజీనామా చేసినట్టు మీడియాలో బహిర్గతమైన లేఖ ఎక్కడుందనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది. టిడిపి నేతలు కూడ ఈ లేఖ విషయమై స్పష్టత ఇచ్చారు. రేవంత్ రాజీనామా స్పీకర్ కార్యాలయానికి చేరుకొని ఆ రాజీనామా ఆమోదిస్తే కనీసం ఆరు మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.

ఉప ఎన్నిక కోసం టిఆర్ఎస్ రెఢీ

ఉప ఎన్నిక కోసం టిఆర్ఎస్ రెఢీ

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్ సన్నాహలు చేసుకొంటుంది.రేవంత్‌రెడ్డి వెంట టిడిపిలో ఉన్న నేతలు, ప్రజా ప్రతినిధుల్లో మెజారిటీ సభ్యులు ఇప్పటికే కారెక్కాశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలపై కూడ టిఆర్ఎస్ వల విసురుతోంది. ఈ నియోజకవర్గం నుండి రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నియోజకవర్గానికి హరీష్‌రావును బాధ్యతలు అప్పగిస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకొన్నారు.

2019లోనే ఎన్నికలు జరిగితే

2019లోనే ఎన్నికలు జరిగితే


కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగకపోతే..2019లోనే ఎన్నిక జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై కూడ చర్చలు సాగుతున్నాయి.2019లో జమిలీ ఎన్నికలతో పాటే కొడంగల్ అసెంబ్లీకి కూడ ఎన్నికలు జరిగితే పరిస్థితులు మరోలా ఉండే అవకాశం లేకపోలేదు.ఆ సమయంలో టిఆర్ఎస్ ఈ నియోజకవర్గంపై ఎక్కువగా కేంద్రీకరించే అవకాశం రాకపోవచ్చు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన వ్యూహన్ని అమలు చేయనుంది. అయితే ఉపఎన్నికల్లో కేంద్రీకరించినట్టుగా జనరల్ ఎన్నికల్లో కొడంగల్ స్థానంపై కేంద్రీకరించే అవకాశం అధికార పార్టీకి దక్కకపోవచ్చు. ఇదే జరిగితే రేవంత్‌రెడ్డికి రాజకీయంగా కలిసివచ్చే అవకాశం కూడ లేకపోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress party seems to have a change of heart on the question of by-election in Kodangal Assembly constituency of A Revanth Reddy. Revanth Reddy who resigned from Telugu Desam Party to join the Congress, Telangana Speaker not received Revanth Reddy's resignation letter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి