రూ.3వేల కోట్లు రావాలి: కేసీఆర్‌కు రేవంత్ లేఖ, గుత్తాపై కోమటిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం రావాలని, కానీ అవి రాకుండా అవినీతి మంత్రులు అడ్డుపడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ఆరోపించారు.

ఆ బాహుబలి హరీష్ రావేనేమో: ఇలా రండి... పవన్ కళ్యాణ్‌కు రేవంత్ పిలుపు

రేవంత్ ఈ రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. హౌసింగ్ జేవీ ప్రాజెక్టుల ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించాలని కోరారు. ప్రభుత్వానికి మూడు వేల కోట్ల ఆదాయం రావాలన్నారు.

Revanth Reddy writes letter to CM KCR on Sunday

పేదలకు ఇళ్లు, ప్రభుత్వానికి ఆదాయం రానివ్వకుండా అవినీతి మంత్రులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రయివేటు సంస్థల ఆధీనంలో ఉన్న భూముల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టాలని డిమాండ్ చేశారు.

ప్రయివేటు సంస్థల బకాయిలను రాబట్టి వాటిని ఇళ్లు కట్టడానికి వినియోగించాలన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోతే ఆందోళన చేస్తామన్నారు. కోర్టులను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.

మంత్రి పదవి రాకపోవడం వల్లే: గుత్తాపై కోమటిరెడ్డి

పూటకో పార్టీ మారే గుత్తా సుఖేందర్ రెడ్డి అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో గుత్తాకు మతిభ్రమించింన్నారు.

యాదాద్రి థర్మల్ ప్లా౦ట్‌తో ప్రభుత్వానికి రూ.26 కోట్ల అదనపు భారం పడుతుందని, పైగా దాని వల్ల ప్రజలకు ముప్పు ఉంటుందనే ఉద్దేశంతో సోలార్ ప్లా౦ట్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Telugudesam leader Revanth Reddy on Sunday wrote letter to Chief Minister K Chandrasekhar Rao.
Please Wait while comments are loading...