వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంగా..: కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డికే ఆదరణ, టిడిపికి ఆయనే దిక్కు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తర్వాత తెలంగాణలో ప్రజాధరణ ఉన్న నేతగా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదేనని ఓ సర్వేలో తేలింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తర్వాత తెలంగాణలో ప్రజాధరణ ఉన్న నేతగా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదేనని ఓ సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆ సర్వే తేల్చింది.

<strong>తిండిలేక, రోడ్డుపై గడుపుతున్నాం: కేటీఆర్‌కు వీడియో సందేశం</strong>తిండిలేక, రోడ్డుపై గడుపుతున్నాం: కేటీఆర్‌కు వీడియో సందేశం

వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తేలింది. అయితే, కేసీఆర్ తర్వాత స్థానంలో ఆదరణలో రేవంత్ రెడ్డి ఉన్నారు. పొలిటికల్ కోషియెంట్ అనే సంస్థ ఏప్రిల్ 2 నుంచి 15 వరకు సర్వే నిర్వహించింది.

సీఎంగా కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డికే.

సీఎంగా కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డికే.

13 వేల పోలింగ్ బూత్‌లో శాంపిల్ తీసుకుంది. లక్షా 19వేల మంది అభిప్రాయాలను తీసుకుంది. ఈ సర్వేలో కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 47.45 శాతం మంది చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని 19.6 శాతం మంది సీఎంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఆ తర్వాతే మిగతా నేతలు

ఆ తర్వాతే మిగతా నేతలు

కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేసులో ఉన్న జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఆ తర్వాత స్థానాలు దక్కాయి. జానా రెడ్డికి 13.9 శాతం, ఉత్తమ్‌కు 7.66 శాతం అనుకూలంగా ఉన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఎవరు అధికారంలోకి వస్తారంటే..

ఎవరు అధికారంలోకి వస్తారంటే..

మళ్లీ తెరాసనే అధికారంలోకి వచ్చేందుకు అవకాశముందని 43.1 శాతం మంది చెప్పగా, కాంగ్రెస్ వైపు 22.95 శాతం మంది మొగ్గు చూపారు. తెలుగుదేశం పార్టీకి 16.24 శాతం మంది, బీజేపీకి ఏడు శాతం మంది అనుకూలమని చెప్పారు.

ప్రతిపక్ష నేతగా రేవంత్ టాప్

ప్రతిపక్ష నేతగా రేవంత్ టాప్

ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డికే ఎక్కువ మార్కులు పడ్డాయి. 30.91 శాతం మంది ఆయన పని తీరును మెచ్చుకున్నారు. జానా రెడ్డికి కేవలం 22 శాతం మాత్రమే ఓటేశారు. ఉత్తమ్‌కు 12.04 శాతం, కిషన్ రెడ్డికి 9.04 శాతం ఓట్లు వచ్చాయి.

English summary
Telangana politics are heating increasing the temperatures in the already hot summer as all parties are conducting secret surveys to findout their strengths and weaknesses in the runup to the 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X